కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, పార్టీలు, ఇతర స్పెషల్ ఈవెంట్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాల వినియోగం లేకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు పచ్చజెండా ఊపినా, నిర్వాహకులు షరతులను పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పబ్‌లు, పార్టీ ప్రదేశాల్లో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించింది. మద్యం మితిమీరిన వినియోగం, డ్రగ్స్ వంటి పదార్థాల వాడకంపై ఎలాంటి దిగొచ్చుడూ ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరం వేడుకలను ప్రజలు సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. డ్రగ్స్ లేని వేడుకలు, భద్రతతో కూడిన ఈవెంట్లను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త సంవత్సరం సంబరాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవడంతో పాటు, ప్రభుత్వం తన ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోగలుగుతుంది. మరి ఆ ఒక్క రోజు ఆదాయం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
This post was last modified on December 28, 2024 1:25 pm
2025 సంక్రాంతికి ఖరారుగా వస్తున్న సినిమాలు నాలుగు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పక్కా ప్లానింగ్ తో…
కొన్ని క్రేజీ కలయికలు తెరమీద చూడాలని ఎంత బలంగా కోరుకున్నా జరగవు. ముఖ్యంగా మల్టీస్టారర్లు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్…
పవన్ కళ్యాణ్ ఎంత పవర్ స్టార్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతతో కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తూ నిత్యం…
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం వల్ల వెంటనే లైవ్ చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. అక్కడ…
ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో…