భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ హిట్ మాన్ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 బంతులు మాత్రమే ఆడిన రోహిత్, కేవలం 3 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వైఫల్యంతో రోహిత్ శర్మ పేరు మీద అరుదైన చెత్త రికార్డు నమోదైంది.
టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యర్థి కెప్టెన్ బౌలింగ్‌లో ఐదుసార్లు ఔట్ అయిన సారథుల జాబితాలో రోహిత్ శర్మ చేరాడు. అతనితో పాటు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 1970లలో సునీల్ గవాస్కర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో ఐదుసార్లు ఔట్ కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ టెడ్ డెక్స్టర్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ రిచీ బెనౌడ్ ఐదుసార్లు పెవిలియన్‌కు పంపాడు.
ఇప్పుడు రోహిత్ కూడా ఈ జాబితాలో చేరడం అభిమానులకు నిరాశ కలిగించింది. రోహిత్ శర్మ తప్పనిసరిగా ఆడాల్సిన మ్యాచ్ లో వెనుదిరగడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. ఈ సిరీస్‌లో అతడి నిరుత్సాహకర ప్రదర్శన మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో భారత జట్టు విజయవకాశాలపై రోహిత్ షాట్ సెలక్షన్ పై కూడా చర్చలు మిన్నంటుతున్నాయి. పూర్తి స్థాయిలో రోహిత్ ఆటకు దురమవుతడనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక 5 టెస్టుల సీరీస్ లో భారత్ 1-1 తో సమానంగా ఉంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా ఇది 4వ టెస్టు. ఇందులో నెగ్గితేనే సీరీస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్లే దారి కూడా సుగమమవుతుంది.
This post was last modified on December 27, 2024 12:10 pm
బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు…
బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు…
టాలీవుడ్ లో పునర్జన్మలది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ కథతో వచ్చాయి. ఏఎన్ఆర్ మూగ…
మార్చి నెలాఖరులో మొదటి రౌండ్ బాక్సాఫీస్ ఫైట్ నిన్న పూర్తయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఎల్2 ఎంపురాన్ ఇతర భాషల్లో…