తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్ లోన్ యాప్‌లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
2021లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు ఈ సమస్యకు సంబంధించిన నివేదికను సమర్పించగా, అందులో అనియంత్రిత రుణాల వ్యాపారాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని ప్రతిపాదించింది. కొత్త బిల్లు ప్రకారం, బంధువులకు ఇచ్చే రుణాలను మినహాయించి, అనుమతుల్లేని రుణదాతలు భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో రుణాలు ఇవ్వడం నిషేధంగా మారుతుంది. రుణాలను తిరిగి వసూలు చేసే సమయంలో హింసాత్మక పద్ధతులను ఉపయోగించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయి.
‘బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు పైన 2025 ఫిబ్రవరి 13 నాటికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. రుణగ్రహీతల రక్షణ కోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు చేర్చబడ్డాయి. రుణాలను చెల్లించలేని వ్యక్తులను వేధించే వారు లేదా నైతికత లేని పద్ధతులతో బకాయిలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తే, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల రుణ గ్రహీతలు రుణదాతల వేధింపులకు గురికాకుండా ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మరి దీన్ని ఎంత కఠినంగా అమలు చేస్తారో చూడాలి.
This post was last modified on December 22, 2024 2:14 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…