అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే పదవి నుంచి దిగిపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయం.. అనేక సందేహాలకు.. అదేసమయంలో అనేక సమస్యలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఎన్నికైన నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గం సదరు నిర్ణయాలపై నిప్పులు చెరుగుతుండడం గమనార్హం. అంతేకాదు.. ‘బైడెన్ మోసకారి’ అంటూ ట్రంప్ అనుచరులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము రద్దుచేస్తామని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
అసలు ఏం జరిగింది?
ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బైడెన్.. చివరి రోజుల్లో.. అధికారం నుంచి దిగిపోయే సమయంలో కీలకమైన హెచ్-1బీ వీసాల నిబంధనలను సరళీకరిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. ఇప్పటి వరకు ఉన్న లాటరీ విధానం పోయి.. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నా.. దాదాపు అంతమందికీ హెచ్-1బీ వీసాలు దొరకనున్నాయి. దీని వల్ల ఐటీ కంపెనీల్లో పనిచేయాలని ఆశలు పెట్టుకున్న భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు మెరుగైన అవకాశాలు దక్కనున్నాయి. ఇదే సమయంలో కీలకమైన ఎఫ్-1 వీసాలను కూడా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇది మంచి పరిణామమే.
కానీ, ఇప్పుడు తీసుకోవడం.. గడిచిన నాలుగేళ్లు మౌనంగా ఉండడం అనేక సందేహాలకు తావిస్తోంది. కానీ, బైడెన్ తీసుకున్న నిర్ణయం పట్ల చైనా, భారత్ సహా బ్రిటన్ పౌరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇంతలోనే ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తూ.. కొత్త అధ్యక్షుడు ట్రంప్ శిబిరం నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. వివాదాస్పద నిర్ణయాలతో బైడెన్ అగ్రరాజ్యం ప్రతిష్టను నడిబజారులో పెడుతున్నారని ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రస్తుతం తీసుకువచ్చిన నూతన నిబంధనలను తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని చెబుతున్నారు.
ఇప్పటికే దేశంలో నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని.. కాబట్టి తమ విధానం ప్రకారం.. హెచ్-1బీ వీసాలను మరింత కఠినతరం చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. తద్వారా స్థానికులకు ఉద్యోగాలు లభించేలా చేస్తామని చెబుతున్నారు. బైడెన్ చేసిన విధానాలను కూడా సమీక్షిస్తామని చెబుతున్నారు. దీంతో బైడెన్ వర్సెస్ ట్రంప్ మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలు.. విదేశీ విద్యార్థులను, వృత్తి నిపుణులను సందిగ్ధంలోకి నెట్టాయనే చర్చ జరుగుతుండడం గమనార్హం. కాగా.. బైడెన్ ప్రతిపాదించిన తాజా వెసులుబాటు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమల్లోకి రానుంది. ఇక, ట్రంప్ ఆ తర్వాత మూడు రోజుల్లోనే అగ్రరాజ్యం అధికార పీఠం ఎక్కనున్నారు. దీంతో బైడెన్ చేసిన హెచ్-1వీ వీసా వెసులు బాటు ఏమేరకు అమలవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
This post was last modified on December 18, 2024 10:22 pm
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…