రాజకీయాల్లో ఎలా ఉన్నా..పాలనలో మాత్రం పారదర్శకంగా ఉంటామని.. ప్రపంచానికి సుద్దులు చెప్పే అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయం దేశాన్ని, ప్రపంచాన్ని కూడా కుదిపేస్తోంది. ఇదేసమయంలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే.. ఏకంగా నిప్పులే చెరుగుతున్నారు. మరో 50 రోజుల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి నుంచి దిగిపోవాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం దక్కించుకున్నారు. ఆయన జనవరి 20న వైట్ హౌస్‌లో అడుగు పెట్టనున్నారు.
అంటే.. ఒకరకంగా.. బైడెన్ నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా.. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే అది వ్యక్తిగతంగా ఆయనకంటే కూడా.. ‘అధ్యక్ష’ పీఠానికి మాత్రం మాయని మచ్చగా మారుతుంది. ఈ విషయం ఆయనకు తెలిసి కూడా.. తాజాగా తన కుమారుడి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదేఇప్పుడు అమెరికాలో కాక రేపుతోంది ప్రపంచ వ్యాప్తంగా కూడా బైడెన్ శైలి తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ అయితే.. ఏకంగా నిప్పులే చెరుగుతున్నారు.
ఏం జరిగింది?
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పెద్దకుమారుడు హంటర్ బైడెన్. ఆయన పేరులోనే హంటర్ ఉన్నట్టుగా.. ఆయనకు హంటింగ్ అంటే ఇష్టం. దీంతో తుపాకులు సేకరించారు. కానీ, వీటిని అక్రమంగా కొన్నారని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేదని.. ఎఫ్‌బీఐ కేసులు నమోదు చేసింది. దీనిపై గతంలోనే విచారణ ముగిసి.. కోర్టు కూడా.. ఆయనను దోషిగా తేల్చింది. ఈ రోజో రేపో.. శిక్ష ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం హంటర్.. బెయిల్‌పై ఉన్నారు. అయితే.. ఈ కేసులో తాజాగా జో బైడెన్ జోక్యం చేసుకున్నారు.
దేశ అధ్యక్షుడిగా,రాజ్యాంగంపై ఆయనకు ఉన్న విచక్షణాధికారాలను వినియోగించి..త న కుమారుడిపై ఉన్న కేసులను రద్దు చేస్తూ.. హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు. అంతే.. ఒక్కసారిగా ఈ నిర్ణయం పెను వివాదానికి దారి తీసింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ వదిలేస్తాడా? ఆయన అయితే.. నిప్పులే చెరిగారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టారని, తానువచ్చాక.. దీనిని తిరిగతోడుతానని హెచ్చరించారు. క్రిమినల్ కేసుల నుంచి కొడుకును తప్పించేందుకా.. ప్రజలు అధికారం ఇచ్చిందని మండిపడ్డారు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా కూడా బైడెన్‌పై విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on December 2, 2024 2:18 pm
2024 సంవత్సరం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అస్సలు కలిసి రాలేదు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ నష్టాలు చూసిన సంస్థ…
మెహ్రీన్ పిర్జాదా.. నాని కృష్ణగాడి వీరప్రేమగాధ చిత్రంతో పెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది.మహానుభావుడు,రాజా…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు భారీ షాక్ తగిలింది. జగన్పై నమోదైన అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సుప్రీం…
ఖాళీ సమయం దొరికితే చాలు కొందరి మేధాశక్తిని ఋజువు చేసుకోవడానికి సినిమాలు తప్ప వేరే సబ్జెక్టు ఉండదు. సరైన వాళ్ళు…
దేశాన్ని రెండు దశాబ్దాలుగా కుదిపేస్తున్న గుజరాత్లోని గోద్రా రైలు దుర్ఘటన వ్యవహారం.. ఇప్పుడు పార్లమెంటుకు చేరింది. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో…
ఒక్క అక్షరంని టైటిల్ గా పెట్టడం, తన పేరునే సినిమాగా తీయడం ఒక్క ఉపేంద్రకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్లు,…