పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన జెరెకొరెలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్ల అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఒక జట్టు అభిమానులు మైదానంలోకి చొచ్చుకురావడంతో, ప్రతిదాడికి దిగిన అవతలి జట్టు అభిమానులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో చిన్న వివాదం క్షణాల్లో పెరిగి పెద్ద ఘర్షణగా మారింది. మైదానంలోనే కాకుండా వీధుల్లో కూడా దాడులు కొనసాగాయి. వేలాది మంది అభిమానులు రోడ్లపైకి వచ్చి పరస్పరం దాడులకు దిగారు.
ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో కొందరు అభిమానులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలవరపెట్టింది. దాడుల్లో గాయపడిన అనేకమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ్ గౌరవార్థం ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు అనేక మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ విధంగా ఘర్షణలు జరిగి, అంత పెద్ద ప్రాణనష్టం చోటుచేసుకోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మిలిటరీ పాలన ఉన్న గినియాలో ఇదే మొదటిసారి ఫుట్‌బాల్ సంబంధిత హింసకర ఘటనలు జరగడం కాదు. గతంలోనూ ఈ తరహా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు
This post was last modified on December 2, 2024 2:04 pm
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా పై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడిందని…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకనో గానీ... లండన్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఉండేందుకు…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ భారీ ప్యాన్…
కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో భారతీయుడు 2 ఒకటి. ఎప్పుడో పాతికేళ్ల…
ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు…