భారత్‌లో మునిగి ..పాకిస్తాన్‌లో తేలాడు !

భారత్‌లో మునిగి ..పాకిస్తాన్‌లో తేలాడు !

కాలం కలిసి రాకపోతే చేతికర్రనే పామై కాటేస్తుందని సామెత. పాపం నిజంగా ఈ భారత జవాను పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుంది. జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ అధికారులు గస్తీ నిమ్తిత్తం రహదారులు, అడవులు, మంచు కొండలే కాదు నదుల్లోనూ తిరుగుతారు. టెర్రరిస్టులు చొరబడతారు అని అనుమానం ఉన్న ప్రతి మార్గంలోనూ అక్కడ సైనికులు పహారా కాస్తూనే ఉంటారు. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మన జవాను కాస్తా పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడు ఆయనను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్‌ నదిలో ఐదుగురు జవాన్లు గస్తీ నిమిత్తం ప్రయాణిస్తున్నారు. నదిలో ప్రవాహం ఉదృతంగా ఉండడంతో పడవ ప్రమాదానికి గురై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు సురక్షితంగా భారత భూభాగానికి చేరుకోగా సత్యశీలయాదవ్‌ అనే సైనికుడు పాకిస్థాన్‌ వైపు కొట్టుకు పోయాడు. దీంతో పాకిస్థాన్‌ ఆర్మీ అతనిని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో తమ జవానును అప్పగించాలని పాకిస్థాన్‌ అధికారులను భారత అధికారులు కోరారు. పాకిస్తాన్‌ అధికారుల నిర్ణయం మీద ఆయన భవిష్యత్‌ ఆధారపడి ఉంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు