జేడీ లక్ష్మీనారాయణ అంతిమ లక్ష్యం ఏమిటి?

జేడీ లక్ష్మీనారాయణ అంతిమ లక్ష్యం ఏమిటి?

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గురించి రాష్ట్రంలో దాదాపుగా అందరికీ తెలుసు. చాలామంది డీల్ చేయటానికి వెనకాముందు ఆలోచించే.. కేసులను టేకప్ చేయటమే కాదు.. వాటిని ఒక పద్ధతిప్రకారం ముందుకు నడిపించటం ఆయనకే చెల్లింది. బళ్లారికి వెళ్లి గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేయటం చాలామంది అధికారులు ఆలోచించటానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటిది ఆయన అడ్డాలోకి వెళ్లి మరీ అరెస్టు చేసి జైలు పాలు చేయటం ఆయనకు మాత్రమే దక్కింది. ఒత్తిళ్లకు లొంగకపోవటం.. సినిమాల్లో మాదిరి హీరోయిజంతో వ్యవహరిస్తూ ఉండే లక్ష్మీనారాయణను రాష్ట్ర ప్రజలు చాలామంది హీరోలా చూస్తుంటారు. అలాంటాయన.. సీబీఐలో తన డిప్యూటేషన్ పూర్తి కావటంతో తిరిగి తన సొంత క్యాడర్ రాష్ట్రమైన మహరాష్ట్రకు వెళ్లిపోతున్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన అంతిమ లక్ష్యం గురించి చెప్పుకొచ్చారు. అంతిమ లక్ష్యం అంటూ ఆయన మాట్లాడేసరికి ఏదైనా సంచలనాత్మకమైన విషయాన్ని ప్రస్తావిస్తారా? అని క్షణం పాటు అనిపించినా.. మిస్టర్ కూల్ మాత్రం తనదైన శైలితో తన అంతిమలక్ష్యం గురించి చెబుతూ.. ‘‘ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి ఎప్పటికైనా డైరెక్టర్ కావాలి. కనీసం మూడు ఐపీఎస్ బ్యాచ్ లకైనా శిక్షణ ఇవ్వాలన్నదే లక్ష్యం’’ అని చెప్పారు. నిజమే..
జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ల దగ్గర శిక్షణ పొందితే.. అప్పటివరకూ ఎవరికైనా మనసులో తప్పుగా ఆలోచిస్తున్నా... నిజాయితీగా వ్యవహరించాలన్న భావన కలగటం ఖాయం. అంటే మనోడు... ‘ఠాగూర్’లోలా బాధ్యత కలిగిన టీచర్ లా ఉండాలనుకుంటున్నాడన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English