కరోనా వైరస్‌కు వ్యాక్సిన్... అదొక్కటే పెద్ద హోప్

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్... అదొక్కటే పెద్ద హోప్

దేశాలకు దేశాలను క్షణాల్లో మాయం చేసే అణు బాంబులు, అంతరిక్షాన్ని చుట్టి వచ్చే ఉపగ్రహాలు... ఇలా అనితర సాధ్యమైన అవిష్కరణలు చేసిన నేటి తరానికి ముచ్ఛెమటలు పట్టిస్తోంది ఓ చిన్న వైరస్. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుట్టలు గుట్టలుగా జనాలు చనిపోతున్నా, విరుగుడు మందు కనిపెట్టలేకపోతున్నారు శాస్ర్తవేత్తలు.  

కరోనా వైరస్‌కు మందు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలకు ఒకే ఒక్క హోప్ కనిపిస్తోంది. చాలా వరకు వైరస్‌లు వెంటవెంటనే జన్యు రూపం మార్చుకుంటూ ఉంటాయి, ఒక్కో స్టేజ్‌లో ఒక్కో రూపంలోకి మారుతూ ఉంటాయి..,  ఉదాహారణకు హెచ్ఐవిని తీసుకుంటే హెచ్‌ఐవి పాజిటివ్‌గా తేలిన వ్యక్తి, ఎయిడ్స్ స్టేజ్‌లోకి వెళితే అతన్ని కాపాడడం కష్టం. కానీ కోవిద్ 19 మాత్రం ఇలా వెనువెంటనే జన్యు రూపం మార్చుకోవడం లేదు. వైరస్ సోకిన చాలామందిలో ఈ వైరస్ ఒకే రూపంలో ఉండడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కాబట్టి కరోనాకు విరుగుడు కనిపెడితే, అది చాలా కాలం పాటు ప్రభావం చూపుతుందని, వైరస్ స్టేజ్ మారితే మరో మందు కనిపెట్టాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. త్వరలోనే ఈ మహమ్మారికి మందు కనిపెడతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English