తెలంగాణ ఉద్యమానికి - రాజధానికి లింకుపెట్టిన స్పీకర్

తెలంగాణ ఉద్యమానికి - రాజధానికి లింకుపెట్టిన స్పీకర్

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఆాచితూచి మాట్లాడాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందేమో గాని స్పీకర్, గవర్నర్, ప్రధాన న్యాయమూర్తులు చేసే వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా ఆ పదవుల గురించి ప్రజలకు అనుమానాలు రేకెత్తేలా చేస్తాయి.

ఇప్పటి రెండు మూడు సార్లు ఒక పార్టీ వ్యక్తిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోరు జారారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యి మూడు రాజధానుల ప్రకటన చేసి ఉండకపోతే కళింగ ఉద్యమం వచ్చేదని వ్యాఖ్యానించారు. పాలనా వికేంద్రీకరన జరగకపోవడం వల్లే తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమం వచ్చిందని... జగన్ లేకపోతే ఉత్తరాంధ్ర పరిస్థితి కూడా అదేనని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్ర వ్యక్తిగా వైజాగ్ ను రాజధాని నేను సమర్థిస్తున్నాను. మూడు రాజధానులపై చంద్రబాబు కూడా సూటిగా స్పందింలి. వైజాగ్ ను రాజధానిగా చేయడానికి చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఈ సందర్భంగా మరోసారి తమ్మినేని సీతారాం ఆరోపించారు.

రైతుల భూములు అమ్మి రాజధాని కడతాను అనడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. చంద్రబాబు విజన్ 2020 అంటే తాను ఏదో అనుకున్నానని... 2020లో జోలెపట్టుకోవడమే ఆయన విజన్ అన్నారు. రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది నిజం కాదా? అని స్పీకర్ పునరుద్ఘాటించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English