ఎట్టకేలకు రైట్‌ స్టెప్‌ వేసిన చిరంజీవి

ఎట్టకేలకు రైట్‌ స్టెప్‌ వేసిన చిరంజీవి

వెండితెరపై స్టెప్స్‌ వేయడంలో చిరంజీవిని మించినోడు లేడని చెప్పొచ్చు. ఎంతో గ్రేస్‌ఫుల్‌గా స్టెప్స్‌ వేసి మెగాస్టార్‌ అయిన చిరంజీవి హీరోగా ఎన్నో రైట్స్‌ వేసాడు. అందుకే అన్నేళ్ల పాటు ఎవరూ అందుకోలేని పొజిషన్‌లో నిలిచాడు. అయితే రాజకీయంగా మాత్రం చిరంజీవి ఒక్క స్టెప్‌ కూడా సరిగా వేయలేకపోయాడు. సరిగ్గా ప్లాన్‌ చేసుకుని ఉంటే చిరంజీవి రాజకీయంగా ఒక శక్తి అయి ఉండేవాడు. కానీ ఎప్పటికప్పుడు రాంగ్‌ స్టెప్స్‌ వేసి పరపతి కోల్పోయాడు. మంత్రిగిరీ వెలగబెడుతున్నా కానీ చిరంజీవికి మునుపు ఉన్న గౌరవం అయితే లేదు. కారణం అతనేసిన రాంగ్‌ స్టెప్సే. చివరకు స్టేట్‌ డివైడ్‌ అవుతున్నప్పుడు కూడా చిరంజీవి సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు. తన తప్పులన్నీ దిద్దుకుని మళ్లీ హీరో అయ్యే ఎన్నో అవకాశాలని చిరంజీవి వదిలేసాడు.

ఫైనల్‌గా రెండు నెలలు సీఎం పీఠంపై కూర్చోడానికి కక్కుర్తి పడిపోతాడని కూడా పుకార్లు షికారు చేసాయి. నిజంగా అదే జరిగుంటే చిరంజీవి ఇమేజ్‌ జీవితకాలానికి డ్యామేజ్‌ అయి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పీఠంపై ఆశ పడితే అంతే సంగతులు. ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా అంటూ చెప్పిన చిరంజీవి మరి ఎలా రియలైజ్‌ అయ్యాడో కానీ చివరకు రైట్‌ స్టెప్‌ వేసాడు. రాజకీయంగా మొదటిసారి తెలివిగా ఆలోచించి సీఎం పదవి వద్దన్నాడు. ఒకవేళ చిరంజీవి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఉంటే సీమాంధ్రలో కనీసం తన ముఖం చూసే వాడు కూడా ఉండేవాడు కాదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English