మూడు రోజుల్లో 60 మంది క్రిమినల్స్ రిలీజ్.. చంద్రబాబులో టెన్షన్

మూడు రోజుల్లో 60 మంది క్రిమినల్స్ రిలీజ్.. చంద్రబాబులో టెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజుల్లో ఏకంగా 60 మంది క్రిమినల్స్ బయటకు రిలీజయ్యారట. నెల రోజుల కిందట మరో బడా క్రిమినల్ కూడా బయటకు రావడంతో ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలు టీడీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏమైనా కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు టీడీపీ ముఖ్యుల నుంచి వ్యక్తమవుతన్నాయి.

గత నెల రోజుల్లో పలువురు కరడు గట్టిన నేరగాళ్లు విడుదల కాగా.. గత మూడు రోజుల్లోనే ఏకంగా 60 మంది రిలీజయ్యారు. ఎర్రచందనం స్మగ్లర్, గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై బాంబు దాడి కేసు నిందితుడు కొల్లం గంగిరెడ్డి కూడానెల రోజుల కిందట జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో కడప జైలు నుంచి బయటకొచ్చారు. చంద్రబాబుపై దాడికేసులో నిందితుడైన గంగిరెడ్డిని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎర్రచందనం కేసుల్లో అరెస్టు చేశారు. గంగిరెడ్డిపై 3 జిల్లాల్లో మొత్తం 27 కేసులున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో పాటు 2003 అలిపిరి పేలుళ్ల కేసులో గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.

2014లో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడు. మారిషస్‌లో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కడపకు తీసుకొచ్చారు. 2015 నుంచి కడప జిల్లా జైలులో ఉంటున్నారు.  అంతకుముందు కూడా ఆయన్ను జైలులో పెట్టినా కూడా శిక్ష పూర్తవకుండానే అక్రమ మార్గాల్లో బటయపడ్డారని ఆరోపిస్తూ విదేశాల్లో తలదాచుకున్న ఆయన్ను చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేసింది.

ఇప్పుడు గంగిరెడ్డి విడుదల కావడం.. రాష్ట్రంలోని కరడుగట్టిన నేరగాల్లు మరికొందరు రిలీజ్ కావడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదైనా పథకం రచిస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కూడా గంగిరెడ్డి విడుదల గురించి నిలదీస్తున్నారు.  స్మగ్లర్, అలిపిరి బ్లాస్ట్ ఘటనలో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి ఎలా జైలు నుండి బయటకు వచ్చాడని… ఎందుకు బయటకు తీసుకొచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English