వైఎస్‌ను మించిన జ‌గ‌న్‌... బాబు రెఢీ

వైఎస్‌ను మించిన జ‌గ‌న్‌... బాబు రెఢీ

ఏపీలో టీడీపీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా ఆ పార్టీ నాయ‌కులు  రాజ‌కీయంగా ఇబ్బందుల పాల‌వుతున్నారు. గ్రామాల్లో ఓ స్థాయి నాయ‌కుడితో పాటు సాధార‌ణ కార్య‌క‌ర్త‌లు వ‌ర‌కు అంతా కేసుల‌పాలై.. త‌ప్పించుకుని తిర‌గాల్సిన‌ దుస్థితి నెల‌కొంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇంత‌టి గడ్డు పరిస్థితిని తాము ఎదుర్కోలేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు అధికార పార్టీ నుంచి వేధింపులు, దాడులు తీవ్రమ‌వ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో క్యాడర్ మొత్తం చెల్లా చెదుర‌వుతోంది.

దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగి, శ్రేణుల్లో ఆత్మ‌స్థైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాయ‌కులంతా క్యాడర్ కు అండగా ఉండాలని.. గ్రామాల్లో పర్యటించాలని దిశానిర్దేశం చేశారు.  అయితే తమ పరిస్థితే దారుణంగా ఉందని ఇక క్యాడ‌ర్ సంగ‌తి దేవుడెరుగ‌ని వారు పట్టించుకోవడం మానేశారు. నాయ‌కులంతా తమను తాము రక్షించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు  నేరుగా రంగంలోకి దిగారు.  క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే గుంటూరులో దాడులకు గురై.. ఊళ్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిన టీడీపీ కార్యకర్తల కోసం.. ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల పని తీరుపై ఆయ‌న తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు శిబిరానికి వచ్చి మాట్లాడి బాధితులను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేస్తే జైళ్లలో ఉంటాం కానీ… పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు.

చట్టాన్ని గౌరవించకుంటే పోలీసుల్ని బాధ్యుల్ని చేస్తూ ప్రైవేటు కేసులు వేస్తామని హెచ్చరించారు. అంతేగాక అధికార పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అధికారం శాశ్వ‌తం కాద‌ని, వైఎస్ కంటే దారుణంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు.

తమ పార్టీ తిరుగుబాటు చేస్తే జైళ్లు సరిపోవని హెచ్చరించారు. బాధితుల ఊళ్లలో తానే ఉంటానని… తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. ఇప్పటివరకు ఏడుగురిని హత్య చేశారన్న చంద్రబాబు… 22 మందిపై భౌతిక దాడులు చేశారని గుర్తుచేశారు. స్వ‌యంగా చంద్ర‌బాబు రంగంలోకి దిగి, శ్రేణుల్లో భ‌రోసా క‌ల్పిస్తుండ‌టంతోనైనా ప‌రిస్థితిలో మార్పు వ‌స్తుందో.. లేదో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English