గుంటూరు టీడీపీకి ఈ నేత‌లు భార‌మేగా?

గుంటూరు  టీడీపీకి ఈ నేత‌లు భార‌మేగా?

రాజ‌కీయాల‌ను వాడుకోవ‌డ‌మే కాదు.. రాజ‌కీయాల‌కు ఉప‌యోగప‌డ‌డం అనేది కూడా ముఖ్య‌మే! అయితే, ఇప్పుడున్న పొలిటిక‌ల్ ఎరీనాలో.. ఇలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీల‌ను, ప్ర‌భుత్వాల‌ను వాడుకుని త‌మ ప‌బ్బం గ‌డుపుకొనే నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది.

ముఖ్యంగా ఈ త‌ర‌హా ప‌రిస్థితి టీడీపీలో ఎక్కువ‌గా క‌నిపించింది. అది కూడా రాజ‌ధాని జిల్లా గుంటూరులోనే ఎక్కువ‌గా క‌నిపించింది. ఈ జిల్లాలోని కీల‌క నాయ‌కులుగా వెలుగొందిన వారు పార్టీని అడ్డు పెట్టుకుని, ప్ర‌భుత్వాన్ని అడ్డు పెట్టుకుని చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. కొంద‌రు ప్ర‌జ‌ల నుంచి దందాలు చేస్తే.. మ‌రికొంద‌రు పంచ భూతాల‌నే దోచుకున్నారు.

ఇలాంటి వారిలో ప్ర‌ముఖంగా వినిపించిన పేరు మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు పేరు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న కోడెల‌.. కుమారుడు, కుమార్తె త‌మ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని గుంటూరును ఏలేశార‌నే వ్యాఖ్య‌లు, విమర్శ లు ఆఖ‌రుకు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి.

ఫార్మా కంపెనీల నుంచి మొదలుకుని భూముల క‌బ్జాలు, బెదిరింపుల వ‌ర కు కూడా కోడెల వార‌సుల పేర్లు బ‌లంగా వినిపించాయి. ఒకానొక ద‌శ‌లో అన్ని ప‌క్షాలూ క‌లిసి కోడెల కుటుంబానికి వ్య‌తిరేకంగా రోడ్డెక్కిన సంద‌ర్భాలు కూడా క‌నిపించాయి.

ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌లో కోడెల ఘోరంగా ఓడిపోయారు.. దీంతో ఆయ‌న పార్టీకి అవ‌స‌ర‌మా? అనే వ్యాఖ్య తాజాగా సీనియ‌ర్ల నుంచి వినిపిస్తోంది. ఆయ‌నుండి కూడా ఏం సుఖం! అనే వ్యాఖ్య‌లు సీనియ‌ర్లు బాహాటంగానే అంటుండ‌డంతో ప‌రిస్థితి తీవ్ర‌త చాలానే ఉందని అర్ధ‌మ‌వుతోంది.

ఇక‌, చంద్ర‌బాబు కూడా పెద్ద‌గా కోడెల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం మానేశారు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ కోడెల పోటీ చేసేది లేదు క‌నుక త్వ‌ర‌లోనే స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి యువ నాయ‌కుడిని నియ‌మిస్తాన‌ని సీనియ‌ర్ల‌కు చూచాయ‌గా చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఇదిలావుంటే, గుర‌జాల‌కు చెందిన రెండు సార్లు ఎమ్మెల్యే అయి హ‌డావుడి సృష్టించిన య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు కూడా పార్టీ విష‌యంలో ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న తాజా ఎన్నిక‌ల్లో గెలిచి, కుదిరితే .. బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకుందామ‌ని భావించారు. అయితే, ఆయ‌న ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఏకంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. ఈయ‌నపై గ‌నుల‌కు సంబంధించిన కేసులు ఉండ‌డంతో ఆయ‌న కూడా పార్టీకి దూర‌మ‌వుతార‌ని, లేదు లేదు.. పార్టీనే ఇలాంటి వారిని వ‌దిలించుకుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English