టీడీపీలో బిగ్ వికెట్‌... ముహూర్తం చూసుకుని బీజేపీలోకి...

టీడీపీలో బిగ్ వికెట్‌... ముహూర్తం చూసుకుని బీజేపీలోకి...

జూపూడి ప్రభాకర్రావు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలతో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. మంచి వాయిస్ ఉన్న నేత కావడంతో వైఎస్ ఎంతో మందికి ఇవ్వ‌ని గౌరవం జూపూడికి ఇచ్చారు.

ఆ తర్వాత వైఎస్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి సైతం అంతే ప్ర‌యార్టీ ఇచ్చారు. 2014 ఎన్నికలలో కొండ‌పి సీటు ఇచ్చినా ఓడిపోయారు. అధికారం కావాలి... అధికార పార్టీలో ఉండాలి అనే సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకున్న జూపూడి కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రోజులు ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత టిడిపి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్‌ చేసేశారు.

ఇక ఇప్పుడు టిడిపికి భవిష్యత్తు లేకపోవడంతో ఆయన అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది తిరిగి ఆయన ఆ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నా చాలా మంది సీనియర్ నేతలు ఆయనను వైసీపీలోకి రానిచ్చే పరిస్థితి లేదు. జగన్ ను నమ్మించి మోసం చేసి బయటకు వెళ్లిన‌ జూపూడి ని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేద‌ని వైసిపి నాయకులు చెబుతున్నారు.

జూపూడి ఇప్పుడు వైసీపీలోనే ఉండి ఉంటే ఆయ‌న మంత్రి కూడా అయ్యేవారు. ఇక ఇప్పుడు మిగిలిందల్లా బిజెపి మాత్రమే. ఏపీలో ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు ఎవరు వచ్చినా ఎంతో అట్టహాసంగా కండువాలు కప్పేస్తోన్న బీజేపీకి దళిత నేతల కొరత ఉంది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జూపూడి బీజేపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నాల్లో భాగంగా బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే చాలా లేట్ అయ్యింద‌ని... ఇప్పుడైనా ఆ పార్టీలోకి వెళితే ఎస్సీ కోటాలో ఏదో ఒక ప‌దవి వ‌స్తుంద‌ని త‌న అనుచ‌రుల‌తో చెపుతున్నార‌ట‌.

బీజేపీలో చేరేందుకు రెడీ అయిన ఆయ‌న్ను ఇప్పుడు ఓ చిక్కు వేధిస్తోంద‌ట‌. ఇటీవ‌ల బీజేపీలో చేరిన సుజ‌నా బ్యాచ్ ద్వారా చేరాలా ?  లేదా ?  పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ & రామ్ మాధ‌వ్ బ్యాచ్ ద్వారా చేరాలా ? అని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా జూపూడి కండువా మార్చేందుకు మంచి ముహూర్త‌మే మిగిలి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English