ఆ మంత్రి త‌న కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌లేదన్న హ‌రీశ్‌

ఆ మంత్రి త‌న కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌లేదన్న హ‌రీశ్‌

కొన్ని సంబంధం లేని వివాదాలు చుట్టుముడుతుంటాయి. తాజాగా అలాంటిదే ఒక‌టి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు క‌మ్ సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావుకు చుట్టుకుంది. ఒక మీడియా సంస్థ ప్ర‌చురించిన ఫోటోకు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకుంటున్నారు. త‌న‌కు ఒక సీనియ‌ర్ మంత్రి పాదాభివందనం చేసిన‌ట్లుగా అచ్చు అయిన ఫోటో త‌ప్పుగా ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు. ఇంత‌కూ జ‌రిగిందేమంటే..

బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణోత్స‌వానికి మంత్రులు త‌ల‌సాని.. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే హ‌రీశ్ హాజ‌ర‌య్యారు. వీరంతా క‌లిసి కులాశాగా మాట్లాడుకోగా.. హ‌రీశ్ అక్క‌డ నుంచి తిరిగి వెళ్లే క్ర‌మంలో గౌర‌వంగా మంత్రులు లేచి నిల‌బ‌డ్డారు. అయితే.. ఆ సంద‌ర్భంగా ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వంగిన‌ట్లుగా ఉండ‌టం.. హ‌రీశ్ న‌వ్వుతూ ఆయ‌న్ను ప‌ట్టుకున్న‌ట్లుగా ఫోటో ఒక‌టి ప్ర‌చురించారు.

హ‌రీశ్ కు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాదాభివంద‌నం చేసే ప్ర‌య‌త్నం చేయ‌గా.. హ‌రీశ్ వారించార‌ని.. ఇది చూసిన స్థానికులు ఆశ్చ‌ర్యానికి గురైన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ ఫోటోను తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన హ‌రీశ్‌.. గౌర‌వ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేచి నిలుచునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే తాను సాయ‌ప‌డ్డానే త‌ప్పించి.. త‌ప్పుగా అర్థం చేసుకొని అచ్చేశార‌ని.. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇది బాధాక‌ర‌మ‌ని.. ఇలాంటివి అచ్చేసే ముందు చెక్ చేసుకోవాల‌ని కోరారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. స‌ద‌రు మీడియా సంస్థ‌లో వ‌చ్చిన ఈ ఫోటో చాలా త‌క్కువ‌మందికే చేర‌గా.. హ‌రీశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారి లక్ష‌లాది మంది దృష్టిలో పడిన ప‌రిస్థితి. ఇలాంటి వాటిపై కామ్ గా ఉండే క‌న్నా.. కామెంట్ చేయాల్సిన అవ‌స‌రం ఉందంటారా హ‌రీశ్‌..?
 

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English