జగన్ తెల్లవారుజామునే అసెంబ్లీకి ప్రిపేరయ్యేవాడట

 జగన్ తెల్లవారుజామునే అసెంబ్లీకి ప్రిపేరయ్యేవాడట

కొత్త శాసనసభ ఏ ఆటంకాలు రాకపోతే ఐదేళ్లు కొలువు తీరనుంది. సంప్రదాయం ప్రకారం కొత్త అసెంబ్లీ ఏర్పడగానే సభ్యులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తారు.  కొత్తవారికి, అసెంబ్లీ గురించి మరింత తెలుసుకోవాలి అనుకునేవారికి వీటి వల్ల ఉపయోగం. ఫ్లోర్ లీడర్ అయిన ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగుతాయి. సభ్యులకు సభపై, వ్యహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించడం ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఈరోజు అమరావతిలోని అసెంబ్లీ హాలులో జరుగుతున్న సమావేశంలో అసెంబ్లీ శిక్షణ, అవగాహన తరగతుల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

ఆయన ఏమన్నారంటే... సభా సంప్రదాయాలు, నిబంధనలపై పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని అందరూ చదవాలని సూచించారు. సభలో మన సంఖ్య ఎక్కువ కదా. మనం చేయి ఎత్తితే స్పీకర్ గారు అవకాశం ఇస్తారని చాలామంది భావిస్తారు. కానీ అలా జరగకపోవచ్చు. ఎందుకంటే ఫలానా అంశంపై వీరు-వీరు మాట్లాడుతారని స్పీకర్ గారికి లిస్ట్ ముందే ఇస్తాం. ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్ గారు అందరికీ అవకాశం ఇస్తారు. ఆ జాబితాలో మన పేరు లేకపోతే మనకు అవకాశం రాకపోవచ్చు. దీనికి మరోలా అనుకోవాల్సిన పనిలేదు అని వివరించారు. కచ్చితంగా తెలుసుకుని మాట్లాడాలని, ఏయే విషయాలపై ఎవరెవరు మాట్లాడాలని అనుకుంటున్నారో, ఆయా పార్టీల శాసనసభ వ్యవహారాల ఇన్ చార్జులకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు.

హైలైట్స్

* అసెంబ్లీలో ఓ సబ్జెక్ట్ పై మాట్లాడేటప్పుడు పూర్తిగా ప్రిపేర్ అయి రావాలి. అపుడే అసెంబ్లీలో మాట్లాడే ప్రతీ స్పీచ్ విజయవంతం అవుతుంది.
* మనం ఎంత గొప్ప వక్త అయినా  ప్రిపేర్ కాకుంటే ఫెయిలవుతాం.
* ప్రిపేర్ కాకుండా ఏదోటి గుర్తొచ్చిందని అప్పటికప్పుడు మాట్లాడితే ఎదుటివారు లేచి ఓ డాక్యుమెంట్ తీసి 'ఇదిగో చూడు.. తెలియకపోతే తెలుసుకో' అని అంటే... మనమంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడతాం. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు’
* ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో మాట్లాడే సబ్జెక్ట్ గురించి తెలుసుకునేందుకు నాలుగైదు గంటలు ప్రిపేరయ్యేవాళ్లం.
* అసెంబ్లీ ఉంటే ఉదయం 4 గంటలకే లేచి సభకు వెళ్లేందుకు పాయింట్లన్నీ అర్థం చేసుకుని సబ్జెక్టుతో వెళ్లేవాళ్లం.
* గతంలో కంటే భిన్నంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.
* ప్రతిపక్షం సభలో ఉండాలన్నది నా ఆకాంక్ష. సభలో అందరికీ సమాన అవకాశాలు కచ్చితంగా ఇస్తాం.
* అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
* ఓ అంశంపై క్షుణ్ణంగా మాట్లాడేందుకు ప్రిపేర్ కావాలన్న తపన సభ్యుల్లో ఉండాలి.
* సభలో మనం మాట్లాడిన దానికి ప్రజలు కనెక్ట్ అయితే... ఆ ఆనందమే వేరు. దాన్ని ఎంజాయ్ చేయండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English