కేశినేని నాని సమ్‌థింగ్.. సమ్‌థింగ్

కేశినేని నాని సమ్‌థింగ్.. సమ్‌థింగ్

చంద్రబాబు బుజ్జగించినా కూడా అలక వీడని తెలుగుదేశం ఎంపీ కేశినేని మరోసారి కలకలం సృష్టించారు. ఈ రోజు ఆయన చేసిన ట్వీట్ పార్టీలోను, ఏపీ రాజకీయాల్లోనూ మరోసారి సంచలనంగా మారింది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చలవ వల్లే వైసీపీ నేత కొడాలి నానికి మంత్రి పదవి దక్కిందంటూ కేశినేని ట్వీట్ చేయడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీల్లోనూ ఈ ట్వీట్ చర్చనీయంగా మారింది.

కేశినేని చేసిన ఈ ట్వీట్ దేవినేని ఉమామహేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని చేసిందేనని అర్థమవుతోంది. దేవినేని ఉమకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ కేశినేని నాని న ట్వీట్లో పేర్కొన్నారు. దేవినేని వల్లే కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి మంత్రి అయ్యే అవకాశం దక్కిందని వ్యంగ్యాస్త్రం సంధించారు.
అయితే.. కేశినేని ఈ ట్వీట్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారన్నది స్పష్టంగా చెప్పకపోయినా కృష్ణా జిల్లా రాజకీయాలు తెలిసినవారు, అక్కడి నేతలు.. అక్కడి రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారు మాత్రం ఈ ట్వీట్ చాలా ఘాటైనదని అంటున్నారు.

కొడాలి నాని మొన్నటి ఎన్నికల్లో తన సిటింగ్ స్థానం గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు. అక్కడ దేవినేని ఉమా బంధువు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ పోటీ చేశారు. గుడివాడలో కొడాలి, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. అలాంటి చోట దేవినేని ఉహా పట్టుపట్టి విజయవాడ నుంచి దేవినేని అవినాశ్‌ని పంపించి పోటీ చేయించారు. కానీ, గెలిపించుకోలేకపోయారన్నది కేశినేని నాని అంతరార్థంగా తెలుస్తోంది.

అవినాశ్ ఓటమికి ఉమాదే బాధ్యతని.. ఉమా వైఫల్యం వల్లే కొడాలి నాని గెలిచి ఏకంగా మంత్రయ్యారన్న అర్థంలో కేశినేని నాని ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతటితో ఆగని కేశినేని.. దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఓ పోస్ట్ చేశారు. మరి టీడీపీ కేశినేని వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English