జగన్ కేబినెట్‌ చూసి టీడీపీ ఫ్యాన్స్ ఖుషీ

జగన్ కేబినెట్‌ చూసి టీడీపీ ఫ్యాన్స్ ఖుషీ

జగన్ కేబినెట్ ఏర్పాటు పూర్తయింది. సామాజిక కోణాలను బేరీజు వేసుకుని మరీ మంత్రులను ఎంపిక చేయడంతో దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఒక విషయంలో మాత్రం ఈ కేబినెట్ కూర్పు టీడీపీ శ్రేణులకు సంతోషాన్ని కలిగించిందని అంటున్నారు. దీనికి కారణం ఎవరో కాదు... రోజా. అదేంటి రోజా కేబినెట్లోనే లేదు కదా అనుకుంటున్నారేమో. అదే టీడీపీ శ్రేణుల సంతోషానికి కారణం.

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటి నుంచి రెండో సారి గెలిచిన రోజా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. ఇదే విషయం సామాజిక మాధ్యమాలతో పాటు న్యూస్ చానెల్స్, వార్తా పత్రికల్లో సైతం ప్రచురణ అయింది. ఇప్పుడు ఆమెకు పదవి దక్కకపోవడంతో రోజాతో పాటు చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలుగుదేశం అభిమానులు మాత్రం దీనిని స్వాగతిస్తున్నారు. దీనికి కారణం ఆమె గతంలో తెలుగుదేశం పార్టీపై, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఇతర నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు చాలా సందర్భాల్లో ప్రవర్తించిన తీరే.

కనీస మర్యాద లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట అనేసేది. మీడియా సమక్షంలో ఏం పీకుతారు, నన్ను రేప్ చేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకసారి ఆమె అతి వల్ల అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురయ్యింది. ఆమె వ్యవహార శైలే ఆమెను మంత్రి పదవికి దూరం చేసిందన్నది తెలుగుదేశం శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English