జగన్ సార్.. ఆయన్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి

జగన్ సార్.. ఆయన్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి

ఓటమిలో ఉన్నవాడు అసహనానికి గురవుతాడు. బాధలో ఉంటాడు. ఆ క్రమంలో మాట తూలొచ్చు. అసహనాన్ని, బాధని చాటొచ్చు. అదుపు తప్పి మాట్లాడొచ్చు. అది అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ గెలిచిన వాడు ఆనందంలో ఉంటాడు  కాబట్టి హుందాతనం చూపించాలి. నోరు జారి మాట్లాడకూడదు. కానీ ఈ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనేత విజయసాయిరెడ్డి. ఆయన గౌరవనీయమైన ఎంపీ. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ ‘ఇంగితం’ అనే పదం వాడాల్సి రావడం విచారకరమే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన అనంతరం విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లు చేస్తూ ఇది చాలా చిన్న పదంలా అనిపిస్తుంది. ఎప్పట్లాగే ఆయన చంద్రబాబును ఆయన విమర్శించారు. అందులో తప్పుబట్టడానికేమీ లేదు. కానీ ఆయన వాడిన భాష మాత్రం దారుణం.

‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైసీపీకి నష్టం కలిగించడానికి పావలాను దించాడు. హెలికాఫ్టర్ గుర్తు, అభ్యర్థుల పేర్లతో గందరగోళం సృష్టించే పనిని కమెడియన్ పాల్‌కు అప్పగించాడు. కుల మీడియా ఉండనే ఉంది. ఎన్నికల్లో వీళ్లందరిపైనా ప్రజలు కాండ్రించి ఉమ్మారు. తుడుచుకోవడానికి జీవిత కాలం సరిపోదు’’.. ఇదీ విజయసాయిరెడ్డి ట్వీట్లలో ఒక ఆణిముత్యం. పవన్‌ను ఈ స్థితిలో పావలా అనడం, ప్రజలు ఉమ్మితే తుడుచుకోవడానికి జీవితకాలం పడుతుందని అనడం.. ఏం సంస్కారమో ఆయనకే తెలియాలి. గెలిచిన వాడు ఎవ్వరూ కూడా ఇంతలా మాట్లాడడు. ఎన్నికలకు ముందు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. కానీ గెలిచాక కూడా ఇలా మాట్లాడే నాయకుడు విజయసాయిరెడ్డి మాత్రమే ఉంటాడేమో. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు కూడా హర్షించే విషయం కాదిది. ఇప్పటికే ఎన్నో దిగజారుడు వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డి ఎంపీ పదవి తాలూకు హుందాతనాన్ని దెబ్బ తీశాడన్న విమర్శలున్నాయి. కానీ విజయం సాధించాక కూడా ఇంత దారుణంగా మాట్లాడితే ఏమంటాం. జగన్ ఇప్పటికైనా ఆయన్ని కంట్రోల్లో పెట్టకపోతే పార్టీ పరువు గంగలో కలవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English