సంచ‌ల‌న స్కాంలో ఏపీ సీఎస్‌?!

సంచ‌ల‌న స్కాంలో ఏపీ సీఎస్‌?!

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేత‌లు జూపూడి ప్రభాకర్, వేమూరి ఆనంద్ సూర్య మీడియాతో మాట్లాడుతూ క‌ల‌కం రేపే వ్యాఖ్య‌లు చేశారు.   తాత్కాలిక సీఎస్‌గా అధికారం ఉన్న సీఎఎస్ లేని అధికారాన్ని ప్రదర్శిస్తున్నారని జూపూడి ఆరోపించారు. నెల్లూరు సింహపురి ఆసుపత్రిలో మానవ అవయవాలను అక్రమంగా దొంగిలించి అమ్ముకునే ముఠాకు సీఎస్ అండగా నిలిచారని ఆరోపించారు. శీనయ్య అనే గిరిజన వ్యక్తి యాక్సిడెంట్ అయి సింహపురి ఆసుపత్రిలో చేరితే బ్రెయిన్ డెడ్ అని డ్రామాలాడి అవయవాలు అమ్ముకున్నారని తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అతని భార్య తెలుసుకొని ఫిర్యాదు చేసిందని, అయితే, ఆసుపత్రి యజమాని పవన్ కుమార్ సీఎస్‌ను కలిశాక కథ‌ అంతా మారిందన్నారు.

23 తరువాత సీఎస్‌గా ఉండనని తెలిసి ఇల్లు చక్కదిద్దుకుంటున్నారని జూపూడి ఆరోపించారు. మానవ అవయవాలు అమ్ముకునే వారికి సీఎస్ అండగా నిలవడాన్ని ఖండిస్తున్నామ‌న్నారు.ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన రిపోర్టు చెత్తబుట్టలో వేసిన సీఎస్‌కి వ్యవస్ధపై ఎంత గౌరవం ఉందో తెలుస్తుందన్నారు.  ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి ఆదేశాలతో సీఎస్ మళ్లీ రిపోర్ట్ కోరారనేది తేలాల్సి ఉంద‌న్నారు. ఇంటీరియం సి.ఎస్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయనుందన్నారు.

సింహపురి ఆసుపత్రి యాజమాన్యానికి సీఎస్ కొమ్ము కాస్తున్నారని ఆనంద్ సూర్య ఆరోపించారు. ఒక వర్గంతో కుమ్మక్కై వారి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. మానవత్వాన్ని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి యాజమాన్యానికి సీఎస్ వత్తాసు పలికారని దుయ్య‌బ‌ట్టారు. సీఎస్ వచ్చినప్పటి నుండి తన సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిప‌డ్డారు. ఇలా పనిచేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. ప్రభుత్వంలో ముఖ్య కార్య‌ద‌ర్శిది ఒక క్లర్క్ తరహా పాత్ర మాత్రమే, ఎన్నికైన ప్రభుత్వానిదే నిర్ణయాధికారమ‌ని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English