జగన్ మరో టూర్... ఈసారి లండన్‌కు

జగన్ మరో టూర్... ఈసారి లండన్‌కు

ఏపీ ఎన్నికల పోలింగ్ తరువాత వైసీపీ అధినేత జగన్ తన విజయంపై గట్టినమ్మకంతో కనిపిస్తున్నారు. దీంతో సుదీర్ఘ పాదయాత్ర, ఎన్నికల ప్రచారం తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఇప్పటికే ఒకసారి విహార యాత్రకు వెళ్లొచ్చారు. ఇప్పుడు జగన్ మరోసారి విహారయాత్రకు వెళ్లనున్నారట. ఈసారి ఆయన తన కుమార్తె విద్యాభ్యాసం చేస్తున్న లండన్‌కు వెళ్లనున్నారట.
    
వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం జగన్ శుక్రవారం ఉదయం లండన్‌కు కుటుంబసమేతంగా వెళ్తున్నారు. లండన్‌లొ చదువుకుంటున్న కుమార్తె వద్దకు భార్యతో కలిసి జగన్ వెళ్తున్నారట. ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉండడంతో జగన్ ఈ అవకాశాన్ని తన కుమార్తెను కలవడానికి వాడుకుంటున్నారట.
    
ఫలితాల తరువాత ఎలాగూ విజయం దక్కుతుందన్న విశ్వాసంతో ఉండడంతో కొద్దికాలం పాటు ఎటూ వెళ్లే చాన్సు ఉండదని.. కాబట్టి ఈలోగానే కుమార్తెను కలిసిరావడంతో పాటు కుటుంబంతో కలిసి యూరోప్‌లో విహరించాలని జగన్ ప్లాన్ చేశారట.
    
రేపు అనగా మే 3న లండన్ వెళ్తున్న జగన్ మళ్లీ మే 14న ఇండియాకు రానున్నారట. ఆయనతో పాటు భార్య భారతి కూడా వెళ్తున్నారు. వీరు లండన్‌తో పాటు స్విట్జర్లాండ్, ఫ్రాన్సులోనూ పర్యటించనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English