కేసీఆర్ ఫిక్స్ అయ్యారు అంతే.. ఇక ఆ శాఖలకు ఎండ్‌ కార్డ్‌ తప్పదు

కేసీఆర్ ఫిక్స్ అయ్యారు అంతే.. ఇక ఆ శాఖలకు ఎండ్‌ కార్డ్‌ తప్పదు

ఇంటర్ వివాదంతో కేసీఆర్ కు రెండో సారి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే తలబొప్పి కట్టింది.. పార్లమెంట్ ఎన్నికలతో పాటు మిగతా నిర్ణయాలు సాఫీగా సాగినా.. విద్యా శాఖకు సంబంధించి ఇంటర్ ఫలితాలు తీవ్ర స్థాయిలో వివాదస్పదమయ్యాయి.. ముఖ్యంగా పది లక్షల మంది విద్యార్థులతో ముడిపడిఉన్న అంశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తల్లి దండ్రులు, విద్యావేత్తలు తీవ్ర స్థాయిలో ఈ విషయమే ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలైతే మంత్రి రాజీనామా దాకా వెళ్లాయి..

తాజా పరిణామాలతో సీఎం తీవ్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.. ఇంటర్ కు అసలు బోర్డు ఎందుకు.. ఎప్పటి నుంచో ఇంటర్ బోర్డు వ్యవహారాలకు సంబంధించి ప్రతి సారీ ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది కాబట్టి మొత్తానికి బోర్డును ఎత్తేసి.. పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేవడానికి సీఎం దాదాపు నిర్ణయానికొచ్చేశారట.. త్వరలో ఈ భారీ నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టే.. మొన్నటి సమీక్ష తర్వాత ఏ అధికారిపై చర్యకు ఉపక్రమించలేదట.. అదే సందర్భంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వ్యవహరశైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన.. సీనియర్ ఐఏఎస్, సమర్థుడిగా పేరు పొందిన విద్యా శాఖ కార్యదర్శి జనార్థనరెడ్డికి పూర్తి పవర్స్ ఇచ్చేశారట.. ఈ వివాదం సమసిపోయేలా.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పూర్తిగా తగ్గేలా చర్యలు తీసుకోవాలి.. మీ పై నమ్మకం ఉందంటూ జనార్థనరెడ్డికి పూర్తి పవర్స్ ఇచ్చారంటున్నారు...

ఈ పరిస్థితుల్లో మొత్తం ఇంటర్ వ్యవహరాన్ని పాఠశాల విద్యాశాఖ గొడుగు కిందకు తెచ్చి.. ఇక నుంచి ఇంటర్ గా కాకుండ్ ప్లస్ 1 ప్లస్ 2 గా సీబీఎస్ఈ తరహా విధానానికి సీఎం పచ్చజెండా ఊపనున్నారని సమాచారం.. ఇదే జరిగితే ఇక పాఠశాల విద్యా శాఖ పరిధిలో సెకండరీ బోర్డు కిందే ఇంటర్ పరీక్షలు జరుగుతాయి... ఇక ఉన్నత విద్యాశాఖ డిగ్రీ, ఇంజనీరింగ్ మిగతా పై స్థాయి విభాగాలను మాత్రమే పర్యవేక్షించనుంది. అలాగే రెవిన్యూపై తీవ్ర స్థాయిలో సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్న మాట తెలిసిందే.. ఇప్పటికే బహిరంగంగా సీఎం తన అసంతృప్తిని వెళ్లగక్కారు.. నమస్తే తెలంగాణ లాంటి పత్రికల్లోనూ ధర్మగంట శీర్షికన రెవిన్యూ లీలలపై ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నారు.. పూర్తిగా అవినీతి ప్రక్షాళన జరిగేలా.. భూ యాజమాన్యం నిర్వహణ శాఖ గా రెవిన్యూ శాఖ ను మార్చబోతున్నారని.. ఇప్పటికే కొందరు సీనియర్ మంత్రులతో సీఎం చర్చించారని తెలుస్తోంది.. అలాగే జిల్లా కలెక్టర్ల పేర్లు కూడా మార్చి.. జిల్లా న్యాయాధిపతి, జిల్లా పరిపాలనాధికారి గా మార్చడానికి రంగం సిద్ధమైపోయింది అంటున్నారు.. అలాగే రెవిన్యూ పరిధిలో ఉన్న తహాశీల్దార్, రెవిన్యూ ఇన్ స్పెక్టర్, సర్వేయర్, విఆర్ఏ స్థాయి వరకు పని విభజన ఆయా పోస్టుల పేరు మార్పు.. వీటిలో కొన్నింటిని పోలీస్ శాఖతో అనుసంధానం చేయడం వంటి సరికొత్త సంస్కరణలతో కేసీఆర్ కొత్త శాఖకు రూపకల్పన చేస్తున్నారనేది ప్రగతి భవన్ టాక్....

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English