మాజీ డీజీపీ ఒక‌రికి ఓటు వేస్తే.. మ‌రొక‌రికి ప‌డింద‌ట‌

మాజీ డీజీపీ ఒక‌రికి ఓటు వేస్తే.. మ‌రొక‌రికి ప‌డింద‌ట‌

ఏదైనా ఇష్యూను టేక‌ప్ చేస్తే.. అనుక్ష‌ణం అదే విష‌యం మీద ఆరాట‌ప‌డే ధోర‌ణి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులో క‌నిపిస్తూ ఉంటుంది. ఓటు వేసిన త‌ర్వాత వీవీ ప్యాడ్ లో మ‌నం వేసిన ఓటు ఏడు సెక‌న్లు క‌నిపిస్తుంది. కానీ.. బాబు అనుభ‌వంలో మూడు సెక‌న్లు మాత్ర‌మే క‌నిపించింది. అంతే.. అప్ప‌టి నుంచి అదే విష‌యాన్ని గ‌ల్లీనుంచి ఢిల్లీ వ‌ర‌కూ చెబుతూనే ఉన్నారు. బాబు మాట‌ల‌కు మ‌ద్ద‌తుగా.. అవును నాకు కూడా ఏడు సెక‌న్లు కాకుండా మూడు సెక‌న్లే క‌నిపించింద‌ని ఒక్క‌రు కూడా చెప్ప‌ని ప‌రిస్థితి.

ఒక్క‌సారి త‌న మైండ్ లోకి ఏదైనా విష‌యాన్ని ఎక్కించుకుంటే.. అనుక్ష‌ణం అదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్ప‌టం బాబుకు అల‌వాటు. తాజాగా ఈవీఎంల‌తో ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టానికి మించిన దుర్మార్గం.. దుర‌దృష్ట‌క‌రం మ‌రేదీ లేద‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రికి త‌న వాద‌న‌ను వినిపిస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పిన విష‌యాన్ని చెబుతున్న చంద్ర‌బాబు మాట‌లు మ‌హా రోటీన్ గా మారిపోవ‌ట‌మే కాదు.. మొనాట‌నీగా మారాయి. అందుకే.. కాస్త ఛేంజ్ కోసం కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల్ని మార్చాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. బాబుకు అలాంవి దొర‌కట్లేదో.. వారి టీం ఆయ‌న‌కు చెప్ప‌ట్లేదో కానీ.. పాత‌వే చెప్పేస్తున్నారు. ఇలాంటివేళ‌.. ఆయ‌న దృష్టికి వ‌చ్చిందో రాలేదోకానీ. అసోం మాజీ డీజీపీ చేదు అనుభ‌వం గురించి బాబుకు తెలిస్తే.. దానిపై జాతీయ‌స్థాయిలో చ‌ర్చ పెట్టేలా చేయ‌గ‌ల‌రు.

ఇంత‌కీ జ‌రిగిందేమంటే.. అసోం మాజీ డీజీపీ హ‌రికృష్ణ దేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను అసోంలోని ల‌చిత్ న‌గ‌ర్ లోని ఎల్ పి స్కూల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లాన‌ని.. ఈవీఎంలో త‌న ఓటు వేసిన‌ట్లు చెప్పారు. అయితే.. తాను ఓటు వేసిన అభ్య‌ర్థికి కాకుండా మ‌రో అభ్య‌ర్థికి సంబంధించిన పేరు మానిట‌ర్ మీద క‌నిపించిన‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు. ఈ విష‌యం మీద తానిప్ప‌టికే ఫిర్యాదు చేశాన‌న్నారు.

తన‌కు ఎదురైన అనుభ‌వాన్ని ఎన్నిక‌ల అధికారుల్ని ప్ర‌శ్నించ‌గా.. వారు రూ.2  చెల్లిస్తే ర‌సీదు ఇస్తామ‌ని.. దాన్ని త‌నిఖీ చేసుకోవ‌చ్చ‌ని చెప్పిన‌ట్లు చెప్పారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశాన్ని ఆయ‌న చెప్పారు. అదేమంటే.. ఓటు వేరే అభ్య‌ర్థికి పోవ‌టంపై ఫిర్యాదు చేస్తే తీసుకుంటామ‌ని.. ఆ ఫిర్యాదు త‌ప్ప‌ని తేలితే ఆర్నెల్లు  జైలుశిక్ష విధిస్తామ‌ని ఎన్నిక‌ల అధికారి హెచ్చ‌రించిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ‌.. ఫిర్యాదు నిజ‌మ‌ని తేలితే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చెప్ప‌లేద‌న్నారు.

ఈ కార‌ణంతోనే తానుఫిర్యాదు చేయ‌లేదున్నారు. ఫిర్యాదు చేసి క‌ష్టాలు కొని తెచ్చుకోవ‌టం ఎందుక‌ని మాజీ డీజీపీ పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఈవీఎంల‌లో త‌ప్పును ద‌ర్యాప్తులో నిర్దారించ‌లేమ‌ని.. అందుకే తాను ఫిర్యాదు చేయ‌లేద‌న్నారు. సాక్ష్యాత్తు డీజీపీనే ఈవీఎంలో త‌ప్పు దొర్లిన వైనాన్ని అనుభ‌వంలోకి వ‌చ్చినా.. కంప్లైంట్ చేయ‌టానికి వెనుకాడ‌ని వైనం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రీ.. ఉదంతాన్ని బాబు ఎంత‌లా వాడ‌తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English