21న వైసీపీలోకి ఎన్టీఆర్ వారసురాలు

21న వైసీపీలోకి ఎన్టీఆర్ వారసురాలు

ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఇప్పటికే వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీకి అధికార మహిళా ప్రతినిధిగా ఆమె కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ కుమార్తె వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 21న ఆమె వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటారు.

పురందేశ్వరి రాకతో వైసీపీ బలం మరింత పెరుగుతందని జగన్ భావిస్తున్నారు. ఎందుకంటే, ఎన్టీఆర్ అభిమాన గణం మొత్తం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతోనే ఉంది. పురందేశ్వరి ఇటు వస్తే అభిమానుల్లో కొంత మార్పు వచ్చి చీలక ఏర్పడుతుందని జగన్ అభిప్రాయం. అందుకే పురందేశ్వరికి సాదరంగా ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది.

పురందేశ్వరి రాకతో వైసీపీలో 2 సీట్లు లాక్ అయినట్టు తెలుస్తోంది. వీటిలో ఒకటి అసెంబ్లీ స్థానం కాగా, రెండోది లోక్ సభ సీటు. పురందేశ్వరి కొడుకు హితేష్ కు పర్చూరు అసెంబ్లీ సీటు కేటాయించే అవకాశం ఉంది. ఇక పురందేశ్వరిని విశాఖ నుంచి పోటీ చేయమని జగన్ కోరే అవకాశం ఉంది. అయితే పురందేశ్వరి మాత్రం గుంటూరు లేదా నర్సారావుపేట అడుగుతున్నారు. సీట్ల సర్దుబాటు సంగతి పక్కనపెడితే, పురందేశ్వరి చేరిక మాత్రం దాదాపు ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English