ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా..

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా..

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో తప్పుడు పత్రాలు సమర్పించిన కారణంగా ఆయన తన అభ్యర్థిత్వం కోల్పోవాల్సి రావడంతో ఇప్పుడు రాజీనామాయే ఆయనకు గతైంది.

అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా కె.ఈరన్న 2014 లో టిడిపి తరపున ఎన్నికయ్యారు. వైసిపి నుంచి పోటి చేసిన తిప్పే స్వామి పై ఈరన్న గెలుపొందారు. ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని పొందు పరిచారని దాని పై విచారణ చేయాలని తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈరన్న పై కర్ణాటకలో ఉన్న క్రిమినల్ కేసులను ఆయన తన ఎన్నికల  అఫిడవిట్ లో చూపించలేదని తిప్పేస్వామి పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఎన్నికల నిబంధనను ఉల్లఘించడం పై విచారణ చేసింది.

విచారణలో ఈరన్న తన పై  ఉన్న కేసుల వివరాలు వెల్లడించలేదని తేలింది. ఈరన్న ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్టుగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఈరన్న ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఎన్నికలు జరిగే వరకు వైసిపి అభ్యర్ధి డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.

నిజానికి ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంది. ఈ విషయాన్ని కూడా ఈరన్న అఫిడవిట్ లో పేర్కొనలేదు. వీటన్నింటిని పరిశీలించిన కోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఈరన్న శుక్రవారం మద్యాహ్నం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అమరావతిలో అసెంబ్లీ కార్యదర్శి కి అందజేశారు. ఈరన్న రాజనామాతో తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English