బీజేపీకి షాక్ఃకీల‌క రాష్ట్రంలో ఎంపీ గుడ్ బై

బీజేపీకి షాక్ఃకీల‌క రాష్ట్రంలో ఎంపీ గుడ్ బై

భార‌తీయ జ‌న‌తాపార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ పార్టీకి కీల‌క‌మైన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో భారీ షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేక్ నియోజ‌క‌వ‌ర్గ ఎంపీ సావిత్రిభాయి ఫూలే బీజేపీకి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీ సమాజంలో అంతరాలు పెంచుతుందని, అసమానతలు సృష్టిస్తోందని సావిత్రిభాయి ఫూలే మండిప‌డ్డారు. దళితులపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆమె గతంలో బహిరంగంగా విమర్శించిన విషయం తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు దళితులపై ప్రేమ ఉంటే హనుమంతుడిని అభిమానించే దాని కంటే రెట్టింపు.. దళితులని ప్రేమించాలని సావిత్రిభాయి ఫూలే సూచించారు.

రాజీనా చేసిన సంద‌ర్భంగా సావిత్రిబాయి మాట్లాడుతూ  హనుమంతుడు దళితుడే. ఆయనను మనువాదులకు బానిసగా మార్చారు. రాముడి కోసం ఆయన ఎంతో చేశారు. కానీ, చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి, ఆయన ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు అని ప్రశ్నించారు. ``ఊరికే హనుమంతుడు దళితుడని చెప్పడం కాదన్నారు. దళితులను ఎప్పుడైనా యోగి కౌగిలించుకున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం యోగి డ్రామాలడుతున్నారని.. ఈ విషయాన్ని దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు గమనించాలని ఫూలే సూచించారు. హనుమంతుడు దళితుడేనని బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే నొక్కి చెప్పారు. దళితుడైనందుకు హనుమంతుడు కూడా అవమానాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. అసలు దళితులను ఎందుకు మనుషులుగా గుర్తించరని ప్రశ్నించారు. కాగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేత్కర్ వర్ధంతి రోజున ఈ పరిణామం చోటుచేసుకోవడం బీజేపీలో చర్చనీయాంశ‌మైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English