అఖిల‌ప్రియ పెళ్లికి...ఇది ఊహించ‌ని షాక్‌

అఖిల‌ప్రియ పెళ్లికి...ఇది ఊహించ‌ని షాక్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి, దివంగ‌త భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల‌ కూతురు అఖిల ప్రియ వివాహం కళ త‌ప్పింది. నేడు ఆళ్ళ‌గ‌డ్డ‌లో ఘ‌నంగా జ‌రిగాల్సిన ఈ వివాహం ఊహించన రీతిలో ప్ర‌ముఖుల గైర్హాజ‌రీని రుచి చూడాల్సి వ‌చ్చింది. అఖిల ప్రియ వివాహానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు కేబినేట్ మంత్రులు హాజ‌రు కావ‌ల‌సి ఉంది.

కాని మాజీ ఎంపీ నంద‌మూరి హరికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణంతో చంద్ర‌బాబుతో పాటు ప‌లువురు మంత్రులు నార్కెట్‌ప‌ల్లిలోని కామినేని ఆసుప‌త్రికి చేరుకున్నారు. దీంతో అఖిల ప్రియ పెళ్లిలో క‌ళ త‌ప్పింద‌ని అంటున్నారు. ఆళ్ళ‌గ‌డ్డ‌లో ఈ రోజు తెలుగు దేశం పార్టీ స‌భ్యులు సంద‌డి చేయాల్సి ఉన్న స‌మ‌యంలో హరికృష్ణ‌ మరణం వాళ్లందరినీ విషాదంలోకి నెట్టింది.

రేపు హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నుండ‌గా, తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనున్నారు. ఈ రోజు ఉద‌యం ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రత్యేక హెలీకాప్టర్‌లో హైదరాబాద్ చేరుకున్న విష‌యం విదిత‌మే. అధికారిక‌ లాంఛ‌నాల‌తో హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు జ‌ర‌పనున్న‌ట్టు సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్ర‌భుత్వ  వర్గాలు త‌గు ఏర్పాట్లు చేస్తున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు