భార‌త‌ర‌త్నాన్ని కీర్తించిన అంత‌ర్జాతీయ మీడియా!

భార‌త‌ర‌త్నాన్ని కీర్తించిన అంత‌ర్జాతీయ మీడియా!

భార‌త‌రత్న‌.. మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ మ‌ర‌ణించిన వార్త యావ‌త్ దేశాన్ని విషాదంలో నింపింది. కొన్నేళ్లుగా అస్వ‌స్థ‌త‌తో ఉన్న ఆయ‌న‌.. కొద్ది వారాలుగా ఎయిమ్స్ లో ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. మృత్యువుతో పోరాడిన ఆయ‌న గురువారం సాయంత్రం శాశ్విత నిద్ర‌లోకి జారిపోయారు. తిరిగి రాని లోకాల‌కు ప‌య‌న‌మై.. భార‌తావ‌నిని శోక‌సంద్రంలో ముంచారు.  
వాజ్ పేయ్ మ‌ర‌ణంపై అంత‌ర్జాతీయ మీడియా భారీగా స్పందించింది. దాయాది పాక్ కు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ సైతం వాజ్ పేయ్ ను కీర్తిస్తూ వార్త‌ల్ని ఇచ్చింది. ప‌లు ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ మీడియాల్లో వాజ్ పేయ్ గురించి ఏమ‌ని పేర్కొన్నాయంటే..

బీబీసీ
పాద‌ర‌సంలాంటి మృదు స్వ‌భావి. భార‌త తొలి ప్ర‌ధాని నెహ్రుకు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి. నెహ్రు యోగా చేస్తూ త‌ల మీద ఎక్కువ‌గా నిల్చోవ‌టంతో ఆయ‌న‌కు త‌ల‌క్రిందుల దార్శ‌నిక‌త వ‌చ్చిందన్న వాజ్ పేయ్ మాట‌ను ప్ర‌స్తావించింది.
 
'ది గార్డియన్'
చాలాసార్లు క‌ఠినంగా క‌నిపించిన హిందూ జాతీయ‌వాద ఉద్య‌మ మిత‌వాద నేత‌. రాజ‌కీయ వైరుధ్యం వాజ్ పేయ్. ప్రోఖ్రాన్ అణుప‌రీక్ష‌ల‌తో పాక్ తో యుద్ధ భ‌యాన్ని క‌లిగించారు. పొరుగుదేశమైన దాయాదితో శాంతి కోసం తొలి ప్ర‌య‌త్నం కూడా ఆయ‌నే చేశారు

ద న్యూయార్క్ టైమ్స్‌
ప్రోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచారు. అదే సమయంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలను తేలికపరిచేందుకు కృషి చేశారు.  ప్రపంచంలో అత్యధిక జనాభా కల దేశానికి తాతయ్యలాంటి వ్యక్తి వాజ్ పేయ్.  అత్యధికంగా హిందువులున్న దేశంలో ముస్లింలు, క్రైస్తవులకు సమాన హక్కులకు ఆయన మద్దతిచ్చారు.
 
‘ద వాషింగ్టన్ పోస్ట్’
భార‌త్‌ను అణ్వాయుధ శ‌క్తిగా తీర్చిదిద్దిన మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ 93 ఏళ్ల వ‌య‌సులో దివంగ‌తుల‌య్యారు

డాన్ (పాకిస్థాన్ మీడియా సంస్థ‌)
పాకిస్థాన్‌తో అద్భుతమైన శాంతి ప్రక్రియను ప్రారంభించారు.భారతదేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన వ్యక్తి వాజ్‌పేయి.  ఆయన అవినీతి మచ్చలేని అరుదైన నేత.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు