ప్రకాష్ రాజ్ హీరోగా ఆయన సినిమా?

ప్రకాష్ రాజ్ హీరోగా ఆయన సినిమా?

డైరెక్టర్ కృష్ణ వంశీ తెలుగులో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు తీశాడు. ఆయన డైరెక్షన్ నటించే అవకాశమంటే నటనలో ఇంకో మెట్టెక్కినట్టేనని యాక్టర్లు భావించేవారు. కానీ కొన్నాళ్లగా ఆయన టైం అస్సలు బాలేదు. ఈమధ్య కాలంలో ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ నెగిటివ్ రిజల్టులే తెచ్చిపెట్టాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడేలే మినహాయించి మిగతావి యావరేజ్ గా కూడా ఆడలేదు.

కృష్ణవంశీ ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అందుకే ప్రేక్షకులను మెప్పించి కాసులు రాబట్టే సబ్జెక్టు కోసం తెగ వెతుకుతున్నారు. కొత్త కథల కోసం చూస్తున్న ఆయనను ఓ మరాఠీ సినిమా ఇంప్రెస్ చేసింది. నట సామ్రాట్ పేరుతో ఆ భాషలో వచ్చిన మూవీ కృష్ణ వంశీని బాగా ఆకట్టుకుందట. అందుకే ఆ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రకాష్ రాజ్ తో చేస్తే బాగుంటుందని భావించి ఆయనను కలిసి కథ కూడా వినిపించాడట. దీనిపై ప్రకాష్ రాజ్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.

కృష్ణ వంశీ - ప్రకాష్ రాజ్ ఇద్దరూ టాలెంటెడ్ పర్సన్సే. అంత:పురం సినిమా నుంచి వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. తన సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దే కృష్ణవంశీ ఆయన మెయిన్ లీడ్ గా సినిమా అంటే మరింత కేర్ తీసుకుంటాడనే అనుకోవచ్చు.అదీగాక మరాఠీ నటసామ్రాట్ లో నటించింది బాలీవుడ్ నటుడు నానా పటేకర్.  ఆ రోల్ కు ప్రకాష్ రాజ్ గ్యారంటీగా న్యాయం చేస్తాడు. ఈ మూవీతో అయినా కృష్ణవంశీ బౌన్స్ బ్యాక్ అవతాడని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English