ఎవరి గోల వారిదే... !!!

ఎవరి గోల వారిదే... !!!

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టిన పని పూర్తయింది. ఆ తీర్మానానంపై చర్చకు ఆమోదించడమూ జరిగింది. ఇప్పుడు దేశం ద్రుష్టంతా " ఫ్రై " డే పైనే. దీని సాకుగా జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బలాన్ని, బలగాన్ని అంచనా వేసుకుందుకు ఉపయోగించుకుంటున్నాయి.

అవిశ్వాస తీర్మానం పై చర్చకు ఆమోదించి తద్వారా కీలక బిల్లులు పాస్చయించుకోవాలన్నది బిజేపి వ్యూహం. గడచిన నాలుగేళ్లలో లోక్‌సభ అమోదం పొందని బిల్లులు అనేకం ఉన్నాయి, వాటికి ఈ సమావేశాలలోనే మోక్షం పలకాలని బిజేపి ఎత్తుగడ. అలాగే అవిశ్వాసంపై చర్చ అనంతరం జరిగే ఓటింగ్ ద్వారా మిత్రులెవరో తెలుసుకోవచ్చుననేది బిజేపి ప్లాన్. తెలుగుదేశం
పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎలాగూ వీగిపోతుందని బిజేపి నాయకులకు తెలుసు.

చర్చకు అనుమతించకుండా లోక్‌సభ సమావేశాలు జరగకుండా చేయడం ఏమంత మంచిది కాదని, అవిశ్వాసానికి తాము భయపడుతున్నట్లు సంకేతాలు వెళ్లడం మంచిది కాదని బిజేపి అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగనే  అవిశ్వాస తీర్మానానికి జై కొట్టారని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఎత్తుగడ మరోలా ఉంది. అవిశ్వాస తీర్మానం ద్వారా తమ మిత్రులెవరు, బిజేపి మిత్రులు, శత్రువులు ఎవరు అనేది బహిర్గతమవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. రానున్న ఎన్నికలలో తాము ఎవరెవరితో జత కట్టాలో, బిజేపితో ఎవరెవరు జత కడతారో ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా వెల్లడవుతుందని కాంగ్రెస్ ఆలోచన. దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటికే జేడిఎప్ వంటి పార్టీతో నేరుగానూ, తెలుగుదేశం పార్టీతో లోపాయికారీగానూ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ జాతీయ స్ధాయిలో ఎవరెవరితో
కలవవచ్చో తెలుసుకోవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల వ్యూహం.

అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడదానికి అనుకూలంగా లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మద్దతు పలకడం
ఇందుకే అంటున్నారు. మొత్తానికి అవిశ్వాస తీర్మానం పుణ్యామాని రెండు జాతీయ పార్టీలు  ఎవరి ఇల్లు వారు సద్దుకునే పనిలో పడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు