మోడి వస్తే కారు, ఫ్యాను అవుట్‌?

మోడి వస్తే కారు, ఫ్యాను అవుట్‌?

మొన్న వచ్చిన సర్వే ఒకటి మన రాష్ట్రంలో చాలా సందేహాలకు తెరలేపింది. హెడ్‌లైన్స్‌ టుడే ఛానల్‌ చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపకు, తెరాసకు 12 ఎంపి సీట్లు వస్తాయని, తెదేపాకు 11 వస్తాయని, కాంగ్రెస్‌కు 7 మాత్రమే వస్తాయని తేలింది. అయితే ఈ సర్వే చివర్లో ఒక చుక్క గుర్తును పెట్టారు. ఆ గుర్తు ప్రకారం, ఒకవేళ నరేంద్రమోడి  రంగంలోకి దిగి ప్రచారం చేస్తే, ముందుగా  సీట్లు కోల్పోయేది జగన్‌ పార్టీ, ఆ తరువాత కెసిఆర్‌ గులాభీయేనని అర్ధమట.

మోడి అంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలామందికి బాగా ఇష్టమని, ఆయనకు ఇక్కడు భారీగా అభిమానగణం ఉందని, ఒకవేళ మోడి ఆంధ్రప్రదేశలో పోటీచేస్తే ఎక్కువ ఓట్లు బిజెపి గూటికిపోయే అవకాశం ఉందంటున్నారు. అసలు ఇంతవరకు బిజెపి ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప ఎక్కడ పోటీచేసే సీన్‌ కూడా కనిపించడంలేదు కాని, ఈ జాతీయపార్టీ మోడి వస్తే  సీట్లు ఎలా గెలుస్తుందో తెలియట్లేదు. మరి కమలం పవర్‌కు కారు, ఫ్యాను ఎలా అవుతవుతాయనేది పొలిటికల్‌ స్క్రీన్‌మీద త్వరలో చూడాల్సిన ఆసక్తికరమైన సినిమా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు