గ్రీన్ కార్డుల కోసం పోరాడితే...హెచ్1బీ వీసాలొస్తున్నాయ్‌

గ్రీన్ కార్డుల కోసం పోరాడితే...హెచ్1బీ వీసాలొస్తున్నాయ్‌

భారతీయ టెకీల‌కు కొంత మోదం...ఇంకొంత ఖేదం! మ‌నోళ్లు ఒక‌దానికి కోసం పోరాటం చేస్తే...అగ్ర‌రాజ్యం అమెరికా ఇంకొక‌టి ఓకే చేసింది. అయితే ఈ రెండు సుదీర్ఘ నిరీక్ష‌ణ‌లో ఉంచిన‌వేకావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే...అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆందోళన బాటపట్టారు. మంగళవారం వాషింగ్టన్‌ నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీలో వేలాది మంది భారతీయ ఉద్యోగులు, నిపుణులు పాల్గొన్నారు. అమెరికా పౌరసత్వమైన గ్రీన్‌కార్డుల జారీకి బాగా జాప్యం జరుగుతోందని, వీటి జారీకి దేశాల వారీ పరిమితి ఎత్తేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళ‌న ఫ‌లితామో తెలియ‌దు కానీ హెచ్‌1బీ వీసాల జారీకి అమెరికా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్1బీ పిటీషన్లపై ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఎత్తివేసినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ పేర్కొంది. భారతీయ ఐటీ ఉద్యోగులు సాధారణంగా హెచ్1బీ వీసాలను దరఖాస్తు చేసుకుంటారు.

అమెరికా కంపెనీలు ఇండియన్ టెకీలకు ఎక్కువగా ఈ వీసాలను జారీ చేస్తాయి. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ పిటీషన్ ఫైలింగ్ ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభంకానుంది. ప్రీమియం ప్రాసెసింగ్ పద్ధతిని ఎత్తివేయడం ద్వారా హెచ్1బీ ప్రాసెసింగ్ సమయం మరింత తగ్గనున్నది. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది.

ఇదిలాఉండ‌గా...అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తులు చాలా మంది గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని వేచి చూస్తున్నారు. దేశాల వారీ కోటా వల్ల పెద్ద ఎత్తున వీరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా హెచ్‌1-బీ వీసాలపై అమెరికా వెళ్లి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి నష్టం కలుగుతోందని, సంవత్సరాల తరబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

దేశాల వారీ కోటాను ఎత్తేయాలని అక్కడి భారతీయులు ఆయా ప్రాంతాల్లోని ఎంపీల మద్దతు కోరుతూ ర్యాలీలు చేశారు. ముఖ్యంగా అర్కాన్సాస్‌, కెంటుస్కీ, ఓరెగావ్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దేశాల వారీ కోటా వల్ల ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై అమెరికన్లకు, ఎంపీలకు అవగాహన కల్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ర్యాలీ నిర్వహకులు తెలిపారు. ఎప్పుడో లిండన్‌ జాన్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ నిబంధనను పెట్టారని, ఈ కాలానికి ఇది ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు