సోము వీర్రాజుకు వార్నింగ్‌

సోము వీర్రాజుకు వార్నింగ్‌

సోము వీర్రాజు ఏపీ ఎమ్మెల్సీ. బీజేపీ ఏపీలో బ‌లంగా లేదు. పార్టీకి పెద్ద‌గా ఎమ్మెల్యేలు కూడా లేరు. మ‌రి ఆయ‌న ఎమ్మెల్సీ ఎట్లా అయ్యారు? అంటే  ఇతర ఎమ్మెల్యేల బ‌లంతో.  ఆయ‌న‌కు ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మ‌ద్ద‌తు ప‌లికారు?  మిత్ర ధ‌ర్మం.! అల‌య‌న్స్ అలోకేష‌న్ కింద టీడీపీ ఎమ్మెల్యేల బ‌లంతో ఆయ‌న శాస‌న మండ‌లి మెట్లు ఎక్కారు. మ‌రి ఆయ‌న ఏం చేస్తున్నారు... బీజేపీ మిత్రుడైన ఏపీ సీఎం చంద్ర‌బాబును తిడుతూ ఉంటారు.

అయితే, ఇటీవ‌లే సోము వీర్రాజు అస‌లు రంగు బ‌య‌ట ప‌డింది. వైసీపీ ద్వితీయ నేత విజ‌య‌సాయి రెడ్డితో క‌ల‌వ‌డం, ఏకంగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో వైసీపీ పార్టీ కార్యాల‌యంలో వైసీపీ నేత‌ల‌తో క‌లిసి టీడీపీని తిట్ట‌డంతో సోము వీర్రాజు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే, ఎందుకో గాని బీజేపీ మిత్రప‌క్ష సీఎంపై త‌న పార్టీ ఎమ్మెల్సీ ప‌దే ప‌దే విమ‌ర్శిస్తూ వ‌స్తున్నా  ఏనాడూ బీజేపీ నోరు మెదిపింది లేదు. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అది కూడా జ‌రిగి పోయింది. సోము వీర్రాజుకు వార్నింగ్ ఇచ్చింది.

పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించి చంద్ర‌బాబును ప‌దే ప‌దే విమ‌ర్శిస్తున్న సోము వీర్రాజుకు  బీజేపీ  జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా నుంచి కాల్ వ‌చ్చింది. త‌ప్పుడు ప‌నులు చేస్తే తప్పించాల్సి వ‌స్తుంది, ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని మాట్లాడు అంటూ అమిత్ షా చీవాట్లు పెట్టార‌ట‌. *మిత్ర‌ప‌క్షంపై ఇష్టానుసారం విమ‌ర్శ‌లు చేసే అధికారం నీకు ఎవ‌రిచ్చారు? మిత్ర‌ధ‌ర్మంపై నువ్వెందుకు నోరు పారేసుకుంటున్నావు? పొత్తుల గురించి పార్టీ చూసుకుంటుంది..నువ్వు మాట్లాడొద్దు. వ్య‌క్తిగ‌త అజెండాతో పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఇంకొక్క‌సారి మీరినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్పువు* అంటూ స్వ‌యంగా అమిత్ షా సోము వీర్రాజుకు కొద్దిసేప‌టి క్రితం ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మ‌ని, పార్టీ నేత‌లు ఎలా ప‌డితే అలా మాట్లాడితే పార్టీ ఊరుకోద‌ని అమిత్ షా హెచ్చ‌రించారు. పార్టీ కంటే ఎవ‌రూ ఎక్కువ కాద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English