లాంగ్‌లీవ్‌లో ఆమ్ర‌పాలి..హానీమూన్‌కు విదేశాల‌కు

 లాంగ్‌లీవ్‌లో ఆమ్ర‌పాలి..హానీమూన్‌కు విదేశాల‌కు

ఐఏఎస్ గా తెలంగాణ రాష్ట్రంలో అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వరంగల్ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎనర్జిటిక్‌, డైనమిక్‌ కలెక్టర్‌గా పేరు సంపాదించారు ఆమ్రపాలి. అలాగే యూత్‌కు ఒక ఐకాన్‌గా నిలిచారు. డయ్యూ, డామన్‌లో ఎస్పీగా పనిచేసే ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో ఫిబ్రవరి 18న ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో  ఆమ్రపాలి లాంగ్ లీవ్ పై వెళుతున్నారు.

త‌న వివాహం నేప‌థ్యంలో...ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు లాంగ్ లీవ్ తీసుకుంటున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వరంగల్, హైదరాబాదులో వివాహ రిసెప్షన్  ఉంటున్నట్టు తెలుస్తుంది.. అందుకోసం హోటల్స్ బుకింగ్ కూడా చేశారు. వివాహం అనంతరం దంపతులు హనీమూన్ కోసం టర్కీ వెళ్లనున్నట్టు సమాచారం.

ఇదిలావుంటే ప్రకాశం జిల్లాకు చెందిన కాటా వెంకటరెడ్డి కుమార్తె ఆమ్రపాలి, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు వెంకటరెడ్డి. చదువులో మంచి ప్రతిభ కనబరచడాన్ని గుర్తించిన వెంకటరెడ్డి ఆమ్రపాలిని ఐఏఎస్ చదివించారు.. కాగా ఐఏఎస్ చదువుతున్న సమయంలోనే సమీర్‌ శర్మతో ఆమ్రపాలి ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

మ‌రోవైపు ఇలా ఉండగా ప్రస్తుతం అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి రూరల్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా ఉన్నారు. ఆమె సెలవులో వెళ్తుండడంతో అర్బన్‌ కలెక్టర్‌గా జేసీ ఎస్‌.దయానంద్, రూరల్‌ కలెక్టర్‌గా జేసీ హరితకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెలవుల అనంతరం కలెక్టర్‌ అమ్రపాలి అర్బన్‌ కలెక్టర్‌గా, రూరల్‌ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English