సూపర్ స్టార్ పార్టీలో పవర్ స్టార్ అమ్మ?

సూపర్ స్టార్ పార్టీలో పవర్ స్టార్ అమ్మ?

సౌత్ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టేశారు. ఈ పార్టీలో చేరేందుకు సినీరంగానికి చెందిన చాలామంది తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. మన దగ్గర స్టార్లు రాజకీయాల్లో యాక్టివ్ అయేందుకు ఊగిసలాడుతుంటారు కానీ.. తమిళనాడులో లెక్కలు వేరేగా ఉంటాయి. సినిమాలు.. రాజకీయం కలగలిసిన చిత్రం అక్కడ కనిపిస్తుంది.

అందుకే రజినీ పార్టీ అనగానే ఇందులో చేరేందుకు చాలామందే ఉత్సాహం చూపుతున్నారు. రీసెంట్ గా లైకా ప్రొడక్షన్స్ కు క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్న రాజు మహాలింగం కూడా రజినీ పార్టీలో చేరుతున్నట్లు చెప్పాడు. అందుకోసమే తన బాధ్యతలకు రాజీనామా ఇచ్చేశాడు కూడా. ఇలా పలువురు కోలీవుడ్ ప్రముఖులు రజినీకాంత్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉండగా.. వీరిలో హీరో విశాల్.. హీరోయిన్ నమితతో పాటు సీనియర్ బ్యూటీ ఖుష్బూ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఖుష్బూ యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినా.. ఆమె పార్టీ మారడం ఖాయంగా చెబుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి మూవీలో.. అమ్మ పాత్రలో కనిపించనుంది ఖుష్బూ. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వనుండగా.. ఇదే సమయంలో తమిళంలో సూపర్ స్టార్ పార్టీలో చేరనుందనే వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సూపర్ స్టార్ పార్టీలో పవర్ స్టార్ అమ్మ అంటూ.. సోషల్ మీడియా జనాలు క్రియేటివిటీ చూపించేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు