హెచ్1బీ వీసాలపై ట్రంప్ షాక్ః ఇంట్లోనే ఉండాలి

హెచ్1బీ వీసాలపై ట్రంప్ షాక్ః ఇంట్లోనే ఉండాలి

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు షాక్ ఇచ్చారు. హెచ్‌-1బీ వీసాల జారీ కఠినతరం చేసేందుకు ఇప్పటికే అమెరికా పలు ఆంక్షలను విధిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌ చట్ట సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. అందుకు ఆమోదం ముద్ర కూడా పడింది. ఇప్పుడు ట్రంప్‌ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. హెచ్‌-1బీ వీసాదారుల భార్యలు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది.

ఈ షాకింగ్ విషయాన్ని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(DHS) అధికారికంగా వెల్లడించింది. ట్రంప్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ‘బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌’ పాలసీ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్‌-1బీ వీసాదారులు, గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న భార్య/భర్తలు అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అర్హులుగా నిబంధన తీసుకొచ్చారు. హెచ్‌-4 డిపెండెంట్‌ వీసా కింద ఒబామా ప్రభుత్వం వాళ్లు ఉద్యోగాలు చేసుకునేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానానికి ట్రంప్‌ ప్రభుత్వం ముగింపు పలకనుంది.

ఇలా చేయడం వల్ల హెచ్‌-1బీ  భార్యలు యూఎస్‌లో ఉద్యోగాల చేయడం కష్టతరమవుతుంది. దీనితో పాటు హెచ్‌-1బీ వీసా నిబంధనల్లోనూ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒబామా తీసుకొచ్చిన ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లోనే సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ అనే బృందం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నిబంధన అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తుందని పిటిషన్‌లో తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు