అవి పాత రాజీనామాలే

అవి పాత రాజీనామాలే

ఇద్దరు మంత్రుల రాజీనామా 'కహానీ' కొత్త పుంతలు తొక్కుతున్నది. మంత్రి ధర్మాన ప్రసాదరావు, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తమపై జగన్‌ ఆస్తుల కేసులో ఆరోపణలు రావడం, సిబిఐ తమను నిందితులుగా చార్జ్‌ షీట్‌లలో పేర్కొనడంపై మనస్తాపం చెంది తమ పదవులకు రాజీనామా చేశారు.

ధర్మాన రాజీనామా వ్యవహారం చాలా పాతది. రాజీనామా చేశారు, రాజీ పడ్డారు ఆయన. సబితా ఇంద్రారెడ్డిది మరీ పాత స్టోరీ కాదు. ఏప్రియల్‌ నెలలో ఆమె తన పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపగా, అది పెండింగులోనే ఉండిపోయింది.

అధిష్టానం వార్నింగ్‌ ఇచ్చాక ఇద్దరూ ఇంకోసారి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి వాటిని ఆమోదించి గవర్నర్‌కి పంపుతారని ప్రచారం జరుగగా, 'అవి పాత రాజీనామాలే' అని సబిత, ధర్మాన పేర్కొనడంతో దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది విన్నవారికి. ధర్మాన, సబిత రాజీనామా చేసినట్టేనా? అన్నదానిపై స్పష్టత రావడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు