కెసిఆర్‌ వ్యూహం ఫలించినట్టే

కెసిఆర్‌ వ్యూహం ఫలించినట్టే

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విసిరిన వలలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు పార్లమెంటు సభ్యులు చిక్కారు. మందా జగన్నాథం, వివేక్‌, రాజయ్య ఫామ్‌హౌస్‌లో కెసిఆర్‌ని కలుసుకున్నారు.

తమ పార్టీలోకి రావాల్సిందిగా కొన్ని నెలల క్రితమే కెసిఆర్‌ వీరికి ఆఫర్‌ ఇచ్చారు. కెసిఆర్‌ ఆఫర్‌పై ఇన్ని రోజులు ఆలోచించి, ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది. కాంగ్రెసు సీనియర్‌ నాయకుడైన కేశవరావు కూడా కెసిఆర్‌ని కలిశారు, ముగ్గురు ఎంపీలతోపాటుగా. జూన్‌ మొదటి వారంలో వీరంతా గులాబీ పార్టీలో చేరనున్నట్లు సమాచారమ్‌. టి.కాంగ్రెసు ఎంపీలు తమ పార్టీలో చేరనుండడంపై సానుకూలంగా స్పందిస్తున్నాయి టిఆర్‌ఎస్‌ వర్గాలు.

కెసిఆర్‌ని కలిసిన టి.ఎంపిలు ఇప్పటివరకూ పార్టీ మార్పు అంశంపై స్పందించలేదు. రానున్న రోజుల్లో స్పందిస్తారేమో చూడాలిక. ఏదేమైనా కెసిఆర్‌ వ్యూహం బాగా పనిచేసినట్లుగా ఉన్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English