బాబు దెబ్బతో హస్తం భయపడిందా?

బాబు దెబ్బతో హస్తం భయపడిందా?

ఇన్ని రోజులూ పాదయాత్రలో ఉండి పట్టించుకోలేదుకాని, పట్టించుకుంటే సీన్‌ ఇంకోలా ఉండేదని చెప్పకనే చెప్పుతున్నారు తెలుగుదేశం ప్రెసిడెంట్‌ చంద్రబాబు నాయుడు. పాదయాత్రలో ఉన్నప్పుడు తన పదునైన మాటలతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన తెదేపా అధినేత, ఇప్పుడు కాంగ్రెస్‌ అవినీతిని టార్గెట్‌ చేశారు.

అసలు కళంకిత మంత్రులను ఇన్ని రోజులు పదవుల్లో ఎలా కొనసాగిస్తారని క్వశ్చన్‌ చేస్తున్న బాబు, మూడు రోజుల నుండి ఇదే విషయమై గవర్నర్‌ నరసింహన్‌ను, ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిశారు. ఇక చంద్రబాబు దూకుడుతో విస్తుపోయిన కాంగ్రెస్‌, తమ మంత్రులైన సబిత, ధర్మానలను సాగనంపక తప్పలేదు.

బయటకు ఏదో నైతికత చూపిస్తూ రాజీనామా చేస్తున్నాం అని చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ ప్రెజర్‌ పెట్టడం వలనే వీరి ఇంటికి పంపించాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా.. ఇక తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అవినీతిపై ఇంకా భారీగా పోరాడతామని చెప్పుకొచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English