ఇండియ‌న్ నిపుణులకు ఈ దేశం వెల్‌కం చెప్తోంది

ఇండియ‌న్ నిపుణులకు ఈ దేశం వెల్‌కం చెప్తోంది

మొద‌ట అమెరికా... ఆ త‌దుప‌రి బ్రిట‌న్‌...ఆ వెంట‌నే ఆస్ట్రేలియా..తాజాగా న్యూజిలాండ్‌...ఇలా ప్ర‌ముఖ దేశాల‌న్నీ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ మార్క్‌ను ఫాలో అవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు గ్లోబలైజేషన్‌ కు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఇన్ని రోజులూ స్వేచ్ఛా వాణిజ్యం పేరిట అన్ని దేశాల్లో వ్యాపారాలు చేసిన అగ్ర రాజ్యాలు.. ఇప్పుడు తమ దేశాల్లో ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి కుటిల నీతిని ప్రదర్శిస్తున్నాయి. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత అంటూ.. విదేశీయుల రాకపై సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నాయి. ఇన్నేళ్ల నుంచి కొనసాగుతున్న వీసా చట్టాలనే మారుస్తున్నాయి.ఇండియన్ టెక్కీల ఎంట్రీకి రెడ్‌ కార్డ్‌ చూపిస్తున్నాయి. సవాలక్ష కారణాలు చూపిస్తూ భారతీయులను తమ దేశంలోకి రాకుండా అ అడ్డుకుంటున్నాయి. కానీ, ఓ దేశం మాత్రం ఇండియన్స్‌ ఆర్‌ ఆల్వేస్‌ వెల్‌ కం అంటోంది. ఆ దేశం పేరు కెన‌డా.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైనప్పటి నుంచి భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. వరుస జాత్యాహంకార దాడులతో ఆందోళన చెందుతున్న ఎన్నారైలను ట్రంప్‌ నూతన వీసా పాలసీ మరింత భయపెడుతోంది. అమెరికా బాటలోనే మిగతా దేశాలూ పయనిస్తున్నాయి. ఆస్ర్టేలియా కూడా 457 వీసా రద్దు చేసింది. బ్రిటన్‌ సైతం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక, గల్ఫ్‌ వైపు చూద్దామంటే.. అక్కడా కష్టాలే. అక్కడున్న భారతీయులు రకరకాల కారణాలతో తిరిగొచ్చేస్తున్నారు. న్యూజిలాండ్‌ కూడా వీసా నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించింది. మలేసియా, సింగపూర్‌ లో కూడా పరిస్థితి బాగా లేదు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో టెక్కీలు ఇప్పుడు ఎక్కడికెళ్లాలో అర్థంకాక సతమతమవుతున్నారు. వీరికి ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక ఆశ కెనడా!

కెనడాలో ఐటీ రంగంలో చాలా మంది నిపుణుల అవసరం ఉంది. కాస్తో కూస్తో ప్రతిభ ఉన్న వారిని సైతం ఆహ్వానిస్తున్నారు. 2021కి ఈ దేశంలో 2.20 లక్షల ఐటీ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని అంచనా. కానీ, ఈ మేరకు ఈ దేశానికి మానవ వనరులు లేవు. దీంతో ఈ దేశం విదేశీ నిపుణులపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 14 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు.

ఈ డిమాండ్‌ ఏటా దాదాపు మూడు శాతం పెరుగుతూ వస్తోంది. వర్చువల్‌ అండ్‌ ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ, త్రీడీ ప్రింటింగ్‌, బ్లాక్‌ చైన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, 5 జీ మొబైల్‌ టెక్నాలజీ రంగాల్లో నిపుణులు, ఉద్యోగులకు కెనడాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇన్మర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ తాజా నివేదికలో వెల్లడించింది. వీరే కాదు.. డేటాబేస్‌ అనలిస్ట్‌లు, డేటా అడ్మినిస్ర్టేటర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డిజైనర్లకు ఇప్పుడు డిమాండ్‌ ఉందని, సంబంధిత రంగాల నిపుణులు, అధ్యయన నివేదికలు వెల్లడించాయి. సో భారతీయ టెకీలు త‌మ విదేశీ కొలువుల కోసం కెన‌డా వైపు సీరియస్ లుక్కు వేయ‌చ్చ‌న్న‌ట‌మాట‌

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు