ఆ డైరీలో అందరి జాతకాలు

ఆ డైరీలో అందరి జాతకాలు

తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు నివాసం, ఆఫీస్ లో ఐటీ సోదాలు జరిగాయి. రామ్మోహన్ రావు అక్రమాలు చేసినట్లు ఒప్పుకున్నారు. పదహారు కోట్లు పన్ను కట్టేందుకు ఆయన కుమారుడు వివేక్ కూడా అంగీకరించారు. అంతటితో కథ ముగిసిందా.. అంటే కాదంటున్నారు ఐటీ అధికారులు.
     
రామ్మోహన్ రావు నివాసంలో దొరికిన ఓ డైరీ.. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రామ్మోహన్ రావు డైరీలో అన్నాడీఎంకే మంత్రులు, సీనియర్ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ ల బాగోతాలున్నాయని మీడియా టాక్. ఈ డైరీ ఆధారంగా దర్యాప్తు జరిగితే తమిళనాడులో కల్లోలమేనని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
       
రామ్మోహన్ రావు డైరీ దొరికిందన్న వార్తలతో తమిళ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరి పేరు చూసి.. ఎవరి మీద అధికారులు వచ్చి పడతారోనని హడలిపోతున్నారు. అన్నాడీఎంకేలో కూడా అటు శశికళ, ఇటు పన్నీర్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
     
రామ్మోహన్ రావు అటు శశికళకు, ఇటు పన్నీర్ కు దగ్గరివారు కాబట్టి.. తమ గుట్టు బయపడుతుందని నేతలు భయపడిపోతున్నారు. ఐటీ దాడుల తర్వాత తమిళనాడులో చాలా ఫైళ్లు నత్తనడకన నడుస్తున్నాయి. ఏ ఫైలు మీద సంతకం పెట్టాలన్నా కూడా అధికారులు జంకుతుండటమే దీనికి కారణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English