రెండు నెలల్లో కష్టాలకు చెక్

రెండు నెలల్లో కష్టాలకు చెక్

నగదు కష్టాలు మరో ఆరు నెలలు కొనసాగుతాయన్న అంచనాలు పటాపంచలు చేస్తూ ఎస్బీఐ పరిశోధనా నివేదిక శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నాటికి క్యాష్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయంటోంది. ఇప్పటికే 500 నోట్ల ముద్రణ వేగంగా సాగుతోందని, అవి దేశంలో సగం రాష్ట్రాలకు కావల్సినంత సంఖ్యలో చేరాయంటోంది.
    
ప్రింటింగ్ ప్రెస్ ల సాధారణ ముద్రణ వేగాన్ని నిపుణులు పరిశీలనలోకి తీసుకుంటున్నారని, కానీ ఇప్పుడు వేగంగా మూడింతలు పెరిగిందని చెబుతోంది. ఈ వేగంతో పనిచేస్తే.. రద్దు చేసిన నోట్లు మార్కెట్లోకి రావడానికి ఎంతో సమయం పట్టదంటోంది.
      
నిజంగా ఎస్బీఐ చెప్పినట్లుగా నోటు కష్టాలు తీరితే అంతకంటే ఎవరికీ కావల్సిందేమీ లేదు. కానీ నిజంగా తీరతాయా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఓవైపు ఫిబ్రవరి నాటికి కష్టాలు తీరతాయని చెబుతున్న అదే ఎస్బీఐ.. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ లాంటి వ్యవసాయ ఆధారిత నగదు లావాదేవీలు జరిపే రాష్ట్రాలకు చిక్కులు తప్పవని విశ్లేషిస్తోంది.
     
ఏటీఎంలు పనిచేయించే దిశగా ఎస్బీఐ ఛైర్ పర్సన్ నోడల్ ఏజెన్సీ చీఫ్ గా వ్యవహరిస్తున్న తరుణంలో ఎస్బీఐ రిపోర్ట్ పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఛైర్మన్ కు చెడ్డపేరు రాకుండా బ్యాంకు స్వామిభక్తి ప్రదర్శిస్తుందేమోనని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు