తమిళనాడులో తమిళ తల్లి

తమిళనాడులో తమిళ తల్లి

తెలుగు తల్లి ఎవడికి తల్లి.. అన్నాడో రాజకీయ ప్రముఖుడు. ప్రత్యేక నినాదంతో తెలంగాణలో రాజకీయ ప్రాబల్యం పెంచుకున్న అతనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలుగు తల్లికి పోటీగా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు కెసిఆర్‌. తెలుగు తల్లి అన్న భావనే తప్పు అని చెప్పిన అదే చంద్రశేఖరరావు తెలంగాణ తల్లి బొమ్మతో రాజకీయం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో తమిళ తల్లి ఆవిర్భవించనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమిళ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ విగ్రహం అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని తలదన్నేలా ఉండబోతున్నదని ఆమె వెల్లడించారు. మధురైలే ఈ విగ్రహం ఏర్పాటవుతుందంట.

'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమాలో ఇలానే ఈ విహ్రాల తల్లులపై ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది. తల్లి ఎవరికైనా తల్లే. ఓ తల్లి బిడ్డలు ఇంకో తల్లి బిడ్డలను గౌరవించాల్సి ఉంటుంది. అప్పుడే విగ్రహాలవల్ల ఇబ్బందులుండవు. లేనిచో ఈ తల్లుల విగ్రహాలు మనుషుల్ని ప్రాంతాల వారీగా విడగొడతాయి. అది విపరీతాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English