డేంజర్లో అమ్మ

డేంజర్లో అమ్మ

అంతా బాగుందనుకుంటున్న సమయంలో అన్నాడీఎంకే శిబిరంపై పిడుగు పడింది. అమ్మ ఇక త్వరలోనే ఇంటికి వస్తారని పార్టీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే జయఆరోగ్యం విషమించిందని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. దీంతో చెన్నైలో ఒక్కసారిగా కలకలం రేగింది.
                   
ఆదివారం సాయంత్రం జయకు హార్డ్ ఎటాక్ వచ్చిందన్న డాక్టర్లు.. స్పెషల్ రూమ్ నుంచి సీసీయూకు ఆమెను తరలించారు. జయకు చికిత్స చేసినలండన్ డాక్టర్ రిచర్డ్ సలహాల ప్రకారం చికిత్స అందిస్తున్నారు. మొన్నటివరకూ బాగున్న జయకు మళ్లీ ఏమైందని అన్నాడీఎంకే వర్గాలు కంగారు పడుతున్నాయి.
        
జయ అనారోగ్యం వార్త తెలిసిన వెంటనే అపోలోకు అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. లోపలికి దూసుకెళ్లే ప్రయత్నంచేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కొంతమంది అభిమానులు ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు.
       
అన్నాడీఎంకేలో చాలా మంది కార్యకర్తలు జయను అమ్మగా పూజిస్తారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. అలాంటి అమ్మకుఏమవుతుందోననే బెంగ వారిని నిలవనివ్వడం లేదు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English