ముఖ్యమంత్రిని కడిగేశార్ట

ముఖ్యమంత్రిని కడిగేశార్ట

డబ్బింగ్‌ సీరియల్స్‌కి టైటిల్స్‌ లాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త కొత్త పేర్లతో పధకాలు ప్రవేశపెడుతూ పోతున్నారు. ఏం చేసినా అవన్నీ కాంగ్రెసు పార్టీని ఇంకోసారి అధికారంలోకి తీసుకురావడానికేనని కిరణ్‌రెడ్డిగారు చెబుతున్నప్పటికినీ, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు తమకు చెప్పకుండా పధకాలను ప్రకటించడమేంటని ఆయన్ని నిలదీస్తున్నారు.

'అర్థం చేసుకోండి..' అని కిరణ్‌రెడ్డి అంతా అయిపోయాక చెబుతుండగా, ఇదేం పద్ధతని కొందరు మంత్రులు ఇప్పటికే కిరణ్‌రెడ్డిని నిలదీయడం జరిగింది. ఇక ఇలా కాదని 'బంగారు తల్లి' పధకం గురించి సమీక్ష నిర్వహించగా, మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డిని కడిగి పారేశారని తెలుస్తున్నది. అంతా మీ ఇష్టమేనా? మాతో చర్చించే పని లేదా? అని జానారెడ్డి విరుచుకుపడేసరికి, ఏం చేయాలో తోచక అంతా పార్టీ కోసమేనని జానారెడ్డికి సర్ది చెప్పార్ట కిరణ్‌రెడ్డిగారు. ఇకపై ఏ పధకం గురించి ఆలోచన వచ్చినా అందరితో చర్చించి దాన్ని ప్రకటిస్తానని కిరణ్‌రెడ్డి జానారెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English