సుజనా ఎందుకిలా చేస్తున్నాడో?!

సుజనా ఎందుకిలా చేస్తున్నాడో?!

ప్రత్యేక హోదా, ఢిల్లీ కేంద్రంగా జరిగే ఏపీ పరిణామాల్లో సందర్భం ఉన్నా లేకున్నా తప్పకుండా తెరమీదకు వచ్చే వ్యక్తి టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఇదే రీతిలో కీలక సమయంలో  అత్యుత్సాహం ప్రదర్శించిన సుజనా తీరుపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. సుజనా తీరు సరికాదని బాబు తేల్చిచెప్పారు.ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కేవీపీ రామచందర్‌ రావు ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో వాడి వేడి చర్చ అనంతరం  ఓటింగ్‌ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్‌సభ లోనే ముందుకు వెళ్లాలని అరుణ్‌ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్‌ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్నిస్పీకర్‌ కురియన్‌ లోక్‌సభకు వదిలేశారు. అది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్‌సభ స్పీకర్‌ తేలుస్తారని చెప్పారు. ఇలా కురియన్‌ రూలింగ్‌ ఇవ్వగానే కేంద్రమంత్రి సుజనా చౌదరి చక్కగా చప్పట్లు కొట్టేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుజనా తీరును చంద్రబాబు తప్పుపట్టారు. అంతటి కీలకమైన సమయంలో సుజనా చప్పట్లు కొట్టడం సరికాదని చంద్రబాబు అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు