రాజ్యసభ ఎన్నికల నుంచి వైకాపా అవుట్..!

రాజ్యసభ ఎన్నికల నుంచి వైకాపా అవుట్..!

రాజ్యసభ ఎన్నికల బరిలో నుంచి వైకాపా తప్పుకోవాలని ఆలోచిస్తుందా..? ఆ పార్టీ తరపున రాజ్యసభకు పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి తాజా జంపింగ్‌ల నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదా ? అంటే అవుననే సమాధానం ఏపీ వైకాపా వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం మూడు టీడీపీకి, ఒకటి వైకాపాకు దక్కే ఛాన్సులున్నాయి.

 అయితే వైకాపా నుంచి వరుసపెట్టి ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. దీంతో వైకాపా బలం చాలా వేగంగా తగ్గిపోతోంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోయారు. మరో 10 మంది పేర్లు కూడా పార్టీ మారే వారి జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ జంపింగ్‌లు ఎన్నికల వరకు ఇలాగే కంటిన్యూ అయితే వైకాపాకు దక్కే ఆ ఒక్కసీటు కూడా కష్టమే అవుతుంది. దీంతో పార్టీ మారుతారని వార్తలు వస్తున్న వారి ఇళ్లకు వెళ్లి మరీ విజయసాయిరెడ్డి బతిమిలాడుకున్నారు. అయితే ఆయనకు పార్టీ మారం అని చెపుతున్న ఎమ్మెల్యేలు తెల్లారితే పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.

 వైకాపా నుంచి రాజ్యసభ బరిలో ఉన్న విజయసాయిరెడ్డి గెలవాలంటే కనీసం 44 ఓట్లు రావాలి. అయితే అంతకు మించి తక్కువ ఓట్లు వస్తే అప్పుడు గెలుపోటములు రెండో ప్రయారిటీ ఓట్లపైనే ఆధారపడి ఉంటాయి. ఎన్నికల నాటికి కనీసం 30 మంది వైకాపా ఎమ్మెల్యేలను లాక్కోవాలనుకుంటున్న టీడీపీ ఆ ప్లాన్‌లో సక్సెస్ అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభ ఆశలు కష్టమవుతాయి. దీంతో ఈ రిస్క్‌లు చేయడం విజయసాయికి ఇష్టంలేదని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి గౌరవం పోగొట్టుకోవడం కంటే, పోటీ చేయకుండా ఉండిపోతే మంచిదని ఆయన నిర్ణయం తీసుకున్నారట.

 మరికొంత మంది వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోతే విజయసాయిరెడ్డి రాజ్యసభ బరిలో ఉండడం కష్టంగానే కనిపిస్తోంది. అప్పుడు ఎన్నికల బరిలో ఉండాలా ? వద్దా ? అనే విషయంలో కూడా జగన్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్ర్త సన్యానం చేస్తే పరువుపోతుందని...విజయసాయికి బదులుగా పార్టీలో కాస్త ఆర్థికంగా స్థితిమంతులైన వారి పేర్లను పరిశీలిస్తే బాగుంటుందని కొందరు సీనియర్లు జగన్‌కు సలహా ఇచ్చారట. మరి ఫైనల్‌గా జగన్ ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు