సర్కారు పోస్టుల్లో రిచ్చ్ రెడ్డీస్

సర్కారు పోస్టుల్లో రిచ్చ్ రెడ్డీస్

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకున్న తాజా నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌ల‌కు తావిచ్చేలా ఉంద‌న్న అభిప్రాయం ఉంది. నిత్యం బిజీబిజీగా ఉండే ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు.. కార్పొరేట్ దిగ్గ‌జాల‌కు ఏపీలోని విశ్వ‌విద్యాల‌యాల పాల‌క‌మండలి స‌భ్యులుగా ఎంపిక చేయ‌టం గ‌మ‌నార్హం.

క్ష‌ణం తీరిక లేకుండా వ్యాపార కార్య‌క‌లాపాల‌తో మునిగిపోయే వారు.. వ‌ర్సిటీ పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా ఏం చేయ‌గ‌ల‌ర‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. విశిష్ట వ్య‌క్తుల కోటాలో వీరి ఎంపిక జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఆయా వ్య‌క్తుల‌కు ఆభ‌ర‌ణంలా ప‌ని చేస్తుందే త‌ప్పించి.. వ‌ర్సిటీల‌కు పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న మాట వినిపిస్తోంది. వ‌ర్సిటీ పాల‌క‌మండ‌ళ్ల‌లో దిగ్గ‌జ కార్పొరేట్ల‌కు ఈ స్థాయిలో స్థానం క‌ల్పించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా ఏపీ స‌ర్కారు 11 విశ్వ‌విద్యాల‌యాల‌కు పాల‌క‌మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. వీటిల్లో ప‌లువురు పారిశ్రామిక దిగ్గ‌జాల‌కు చోటు క‌ల్పించ‌టం క‌నిపిస్తుంది. కార్పొరేట్ల‌తోపాటు.. ప‌లువురు డాక్ట‌ర్లు.. న్యాయ‌వాదుల‌ను పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా ఎంపిక చేయ‌టం గ‌మ‌నార్హం. అలా ఎంపిక చేసిన వారిలో కొంద‌రిని చూస్తే..
+ సి.హెచ్‌.శైలజాకిరణ్‌ (మార్గదర్శి)
+ బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి (ఇన్ఫోటెక్‌)
+ సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్‌)
+ శిరిని రాజు (శ్రీసిటీ)
+ బొల్లినేని కృష్ణయ్య (బొల్లినేని హాస్పిటల్స్‌)
+ జి.వి.సంజయ్‌రెడ్డి (జి.వి.కె.గ్రూపు)
+ కృష్ణారెడ్డి (మెగా ఇంజనీరింగ్‌) తదితరులు

కొసమెరుపు ఏంటేంటే.. వైఎస్ అధికారంలో ఉన్నపుడు ఈ ఎంపిక జరిగినా ఒకటి తప్ప మిగతా అన్నిపేర్లు ఉండేవేమో అనిపించేలా ఉందీ లిస్టు. బాబు రెడ్లకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు