హాట్‌ ఫోటో: మేడమ్‌ ర్యాంప్‌ ఆడించేస్తోంది

హాట్‌ ఫోటో: మేడమ్‌ ర్యాంప్‌ ఆడించేస్తోంది

    బాలీవుడ్‌లో ఎవరు పడితే వాళ్లు అందలం ఎక్కలేరని, అక్కడ రాణించాలంటే స్పెషల్‌గా ఏదో ఉండాలని ఇలియానా రుజువు చేస్తోంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి ఈమధ్య కాలంలో వెళ్లిన హీరోయిన్లలో ఇలియానా రేంజ్‌లో ఎవరూ స్టాంప్‌ వేయలేకపోయారు. అందాల ప్రదర్శనకి, బోల్డ్‌ సీన్స్‌కి దూరంగా ఉంటానంటే బాలీవుడ్‌లో ఒప్పుకోరు. కరీనాలైనా, కత్రినాలైనా కానీ బికినీల్లో కనిపించి మురిపించాల్సిందే. టాప్‌ హీరోయిన్లే ఏది చేయమంటే దానికి తల ఊపుతుంటే ఇక్కడ్నుంచి వెళ్లిన హీరోయిన్లు మేం చేయమని మడి కట్టుకుంటే కుదురుతుందా.

ఈ కిటుకు కనిపెట్టి, తన అందాలకి తెర తీసి ఇలియా అందలం ఎక్కేసింది. ఫోటోషూట్స్‌లో, సినిమా షూట్స్‌లోనే కాదు ర్యాంప్‌పై చీర కట్టుకుని క్యాట్‌ వాక్‌ చేసినా కానీ ఎక్స్‌పోజింగ్‌కి పెద్ద పీట వేస్తోంది మేడమ్‌. తనని జనం చూడాలంటే ఏం చూపించాలో ఇలియానాకి బాగా తెలుసు. అందుకే ఏ భాషలో అయినా అలా రాణించేస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English